తెలుగు

“దేవినేని” ఏ నాయకుడికి సంబంధించిన కథ కాదు.

By admin

February 22, 2021

ఇది దేవినేని నెహ్రూ (బెజవాడ) ఒరిజినల్ బయోపిక్ కానే కాదు. డైరెక్టర్ గా, కథకుడిగా తను ఊహించి రాసుకున్న కథే అని చెబుతున్నారు దర్శకుడు నర్రా శివనాగు. ఎలక్ట్రానిక్ & సోషల్ మీడియా ద్వారా ఏ నాయకుడికి సంబంధించిన కథ కాదనీ ఇది ఒక కమర్షియల్ ఫార్ములా కథ అనీ దర్శకుడు క్లియర్ గా అర్థమయ్యే విధంగా ఆవేదన వ్యక్తం చేసినా కూడా ఆంధ్ర ప్రదేశ్ నుండి కొంతమంది నాయకులు రకరకాలుగా ఇబ్బంది కరమైన ఫోన్లు చెయ్యడం వాట్సాప్ మెస్సేజ్ లు పంపించి దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. “దేవినేని” సినిమా వల్ల ఏ రాజకీయ నాయకులకు ఎలాంటి డామేజ్ కలగదనీ, ఏ నాయకులకు తమ రాజకీయ జీవితాలకు ఈ “దేవినేని” మూవీ డామేజ్ చేయదనీ దర్శకుడు నర్రా శివనాగు ఇంతకు ముందే మీడియా ముఖంగా వివరించడం జరిగింది.

ఇది బయోపిక్ సినిమా అని పత్రికల వాళ్లు రాస్తున్నారు. ఇది బయోపిక్ కాదు, దయచేసి గమనించగలరు.

కోర్ట్ ద్వారా ఫైట్ చేస్తామనీ, ఎంత దూరమైనా వెళ్తామనీ లేటెస్ట్ గా కొన్ని వాట్సాప్ మెసేజ్ లు వస్తున్నాయి.

బ్రదర్ దయచేసి మీరు ఏవేవో ఊహించుకోకండి. ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుణ్ని కించపరచే విధంగా గానీ డామేజ్ చేసే విధంగా కానీ “దేవినేని” మూవీ ఉండదు. ఇది ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ మాత్రమే.

ఫిలిం చాంబర్స్ “దేవినేని” టైటిల్ ని సర్టిఫై చేశాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్ (సెంట్రల్ గవర్నమెంట్) ఈ చిత్రాన్ని చూసి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. “దేవినేని” చిత్రంలో నటించిన హీరో కూడా నందమూరి ఫ్యామిలీలో ఒక పెద్ద హీరోనే. దర్శకుడు కూడా ఎంతో అనుభవంతో ఎన్నో చిత్రాలు చేసి ప్రజాదరణ పొందిన దర్శకుడే.

ఈ “దేవినేని” చిత్రం ఏ నాయకుణ్ని డామేజ్ చేసే విధంగా ఉండదని మరొక్క సారి మనవి చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

AP.Com DESK, Hyd