తెలుగు

*దేవినేని సినిమా విడుదల ను వెంటనే నిలిపివేయాలి*

By admin

February 22, 2021

  1. *దేవినేని సినిమా విడుదల ను వెంటనే నిలిపివేయాలి*

మా అంగీకారం లేకుండా మా మనోభావాలు దెబ్బ తినేలా దేవినేని సినిమా నిర్మాణం జరిగిందని వెంటనే ఆ సినిమా విడుదల నిలిపివేయాలని హైకోర్టు లో కేస్ వేసినట్టు విజయవాడ కు చెందిన దేవినేని రవీంద్ర తెలిపారు. శనివారం మీడియా తో మాట్లాడిన ఆయన గతంలో జరిగిన విషయాలు మర్చిపోయి మేమంతా ఇప్పుడు ప్రశాంతంగా జీవిస్తున్నాం అని,మరల ఇప్పుడు కుల ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా ఈ సినిమా తీయడం మంచి పద్ధతి కాదని దర్శకనిర్మాతలను హెచ్చరించారు.వెంటనే సినిమా తదుపరి కార్యక్రమంలు నిలిపివేసి,మొదట మాకు కధ వినిపించి ఇంకో పేరుతో విడుదల చేసుకోవాలని సూచించారు. లేకపోతే చట్టపరంగా ఎదుర్కొంటాం అని రవీంద్ర అన్నారు.