గ్రీన్ ఇండియాగ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన టిఎఫ్‌సిసి ఛైర్మన్ డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, శ్రీమతి సుగుణ
ఎంపీ సంతోష్‌కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు తమ పెళ్ళి వార్షికోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కాలనీ, బంజారాహిల్స్‌లో టిఎఫ్‌సిసి ఛైర్మన్ డా.ప్రతానిరామకృష్ణ గౌడ్, శ్రీమతి సుగుణ గారు మొక్కలు నాటారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నేడు టిఎఫ్‌సిసి ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ వివాహ మహోత్సవం సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, కార్డు ఉన్నా లేకున్నా అందరికీ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేద కళాకారులకు, టెక్నీషియన్లకు గత యేడాది నుండి టిఎఫ్‌సిసి సహాయం చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు 20 వేల మందికి సహాయాన్ని అందించారు. ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో టిఎఫ్‌సిసి ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్‌తో పాటు వైస్ ఛైర్మన్ గురురాజ్, సెక్రటరీ కాచెం సత్యనారాయణ, అతిధి రాజుగుప్తా తదితరులు పాల్గొన్నారు.