‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ టీజర్ విడుదల చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్
రమణ్ కథానాయకుడిగా సిరి మూవీస్ బ్యానర్‌పై కె. శిరీషా రమణారెడ్డి నిర్మిస్తున్నచిత్రం `రెడ్డిగారింట్లో రౌడీయిజం`. ఎం. రమేష్, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష విశ్వనాథ్, ప్రియాంక, పావని, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందని, సినిమా పెద్ద హిట్ కావాలని అభిలషిస్తూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు వినాయక్. ఈ సందర్భంగా….
హీరో రమణ్ మాట్లాడుతూ ‘‘మా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ మూవీ టీజర్‌ను విడుదల చేసి అభినందించిన వినాయక్‌గారికి స్పెషల్ థాంక్స్. సినిమా విషయానికి వస్తే… పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు సహకారంతో సినిమాను సకాలంలో పూర్తి చేశాం. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. హైదరాబాద్, గోవా, రాయలసీమ ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేశాం. సినిమాలో ఐదు పాటలు, నాలుగు ఫైట్స్ ఉంటాయి. నలబై ఎనిమిది రోజుల్లోనే పక్కా ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేశాం. టైటిల్ చూసి ఇదేదో ఓ వర్గానికి సంబంధించిన సినిమా అనో, మరో వర్గాన్ని కించ పరిచే సినిమా అనో అనుకోకండి. సినిమా చూస్తే టైటిల్ ఎందుకు పెట్టామో అర్థమవుతుంది. హీరోగా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది. సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ సోదరి కుమార్తె వర్షా విశ్వనాథ్ మా సినిమాలో హీరోయిన్‌గా నటించారు. అలాగే సీనియర్ నటుడు వినోద్ కుమార్‌గారు విలన్‌గా చేశారు. ఆయనతో నటించే సమయంలో నటుడిగా చాలా విషయాలను నేర్చుకున్నాను. నేను హీరోగా యాక్ట్ చేస్తున్న రెండో సినిమా పూర్తి కావచ్చింది. మరో రెండు సినిమాలు వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. అలాగే ఓ పాన్ ఇండియా మూవీని కూడా చర్చల దశలో ఉంది’’ అన్నారు.
దర్శకులు ఎం. రమేష్, గోపి మాట్లాడుతూ ‘‘‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎ.కె.ఆనంద్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. అలాగే మహిత్ నారాయణ్‌గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మా సినిమా తొలి పాటను వై.ఎస్.షర్మిలగారు విడుదల చేశారు. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌గారు రెండో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ రెండు సాంగ్స్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వినాయక్‌గారు టీజర్ విడుదల చేసి సపోర్ట్ అందించారు. అందరికీ మా యూనిట్ తరపున ధన్యవాదాలు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.
నటీనటులు: రమణ్, వర్ష విశ్వనాథ్, ప్రియాంక, పావని, అంకిత, వినోద్ కుమార్, రచ్చ రవి, మిర్చి మాధవి, జూనియర్ బాలకృష్ణ, శంకర్, కృష్ణ, ప్రకాష్ అడ్డా, వెంకట్, సిద్ధు
సాంకేతిక బృందం: రచన-దర్శకత్వం: ఎం. రమేష్, గోపి నిర్మాత: కె. శిరీషా రమణారెడ్డి బ్యానర్: సిరి మూవీస్ సమర్పణ: కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి సంగీతం: మహిత్ నారాయణ్ బ్యాగ్రౌండ్ స్కోర్: శ్రీవసంత్ సినిమాటోగ్రఫీ: ఎ.కె. ఆనంద్ ఎడిటింగ్: శ్రీనివాస్ పి. బాబు, సంజీవరెడ్డి ఆర్ట్: నరేష్ సిహెచ్. ఫైట్స్: అల్టిమేట్ శివ, కుంగ్‌ఫూ చంద్రు కొరియోగ్రఫీ: చందు రామ్, రాజ్ పైడి, సాయిశివాజీ