తెలుగు

ఉపాధ్యాయ దినోత్సవం ముఖ్యమైన పండుగ – హీరో మంచు విష్ణు

By admin

September 05, 2021

ఉపాధ్యాయ దినోత్సవం ముఖ్యమైన పండుగ – హీరో మంచు విష్ణుప్ముఖ నటులు, గౌరవనీయులైన శ్రీ మంచు విష్ణు గారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఒక ముఖ్యమైన పండుగగా అభివర్ణిస్తూ, వారి తరపున మరియు వారి కుటుంబం తరపున శుభాకాంక్షలు అందించారు.శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు గత 30 సంవత్సరాలుగా పాఠశాల స్థాయి నుండి ఉన్నతస్థాయి విద్య వరకు విద్యార్థులకు నాణ్యమైన మరియు విలువలతో కూడిన విద్యనందిస్తున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 18,000 మంది విద్యార్థులు ఇక్కడ తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోగలుగుతున్నారు.

శ్రీ విద్యానికేతన్ కుటుంబంలో ఉపాధ్యాయుల దినోత్సవాలు అంతర్భాగమని సినీ హీరో విష్ణు మంచు గారు అన్నారు. మంచు విష్ణు తాతగారైన దివంగత శ్రీ మంచు నారాయణస్వామి నాయుడు గారు తిరుపతి సమీపంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. డా॥ యమ్.మోహన్ బాబు గారు బోధనారంగ వారసత్వాన్ని అందించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి రాకముందు, శ్రీ మోహన్ బాబు గారు వ్యాయామ ఉపాధ్యాయుడు.

ఉపాధ్యాయులకు శాశ్వత గౌరవ సూచకంగా, విద్యా రంగంలోని వారి సేవలకు గుర్తింపుగా, శ్రీ విద్యానికేతన్ ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో వారిని సత్కరించే గొప్ప సంప్రదాయాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. సమర్ధవంతంగా విద్యలో రాణించడమే కాకుండా, విద్యార్థులలో లలిత కళల స్ఫూర్తిని పెంపొందించడంలో శ్రీ విద్యానికేతన్ ఒక శక్తివంతమైన విద్యా స్ఫూర్తిని చాటుతోందన్నారు.

శ్రీ విష్ణు మంచు మాట్లాడుతూ – కోవిడ్ మహమ్మారి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది జీవితాలను కుదిపేసింది. మంచి హృదయం కలిగిన సినీ ప్రముఖులు, కళాకారులు తమ పేద సహచరులలో చాలామందికి నగదు రూపంలో సహాయం అందించి అద్భుతమైన సహృదయంతో కోవిడ్ బాధిత కుటుంబాల బాధను అధిగమించేలా చేయగలిగారు. మా చలనచిత్ర కళాకారుల యొక్క ఈ ప్రయత్నం ఖచ్చితంగా కష్ట సమయాల్లో బాధిత కుటుంబాల పిల్లల విద్యా అవసరాలను సకాలంలో తీర్చడంలో వారి కుటుంబాలు నేరుగా సహాయపడతాయన్నారు.

పవిత్రమైన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సినీ కళాకారులకు సన్మానం, ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో సహచరులకు మరియు సాధారణంగా చిత్ర పరిశ్రమకు వారు అందించిన సేవానిరతిని గౌరవించడానికి తగిన విధంగా ఉంటాయని శ్రీ విష్ణు మంచు అభిప్రాయం వెలిబుచ్చారు. ఇప్పటికీ ప్రబలంగా ఉన్న కోవిడ్ ఆంక్షల దృష్ట్యా, చిత్ర కళాకారులను సన్మానించడం అనేది ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా, అంటే సెప్టెంబర్ 4న మొదటి బ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ విశిష్ట కార్యక్రమానికి తమ సంఘీభావం తెలుపుతూ ఉత్తమ సహకారాన్ని అందించాలని విష్ణు మంచు గారు కళాకారులను కోరారు.