తెలుగు

*ఎడిటర్ మోహన్ ని ఆకర్షించిన శివనాగు “మధురై సింగం”*

By admin

September 05, 2021

*ఎడిటర్ మోహన్ ని ఆకర్షించిన శివనాగు “మధురై సింగం”*

ఎవరెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన తమిళ చిత్రం “మధురై సింగం”. నర్రా శివనాగు దర్శకత్వం వహించిన తెలుగు “దేవినేని” చిత్రాన్ని అమేజాన్ ఏజన్సీ కంపెనీ అయిన యాపిల్ సినిమా సమర్పించడం విశేషం .

తమిళనాడులో వడివేలు అంటే ఒక సంచలనం. వడివేలు అంటే బాక్సాఫీస్ బద్ధలే..!

వడివేలు ఫ్యామిలీ నుంచి ఒక డాషింగ్ & డేరింగ్ టీనేజ్ అమ్మాయి “డాక్టర్ దివ్య సుందర వడివేలు నిర్మాతగా తమిళ అనువాద హక్కుల్ని సొంతం చేసుకుని తమిళ ప్రేక్షకులకు అందించ బోవటం మరో విశేషం.

తెలుగు సినిమానే ఎందుకు అనువాదిస్తున్నారు అంటే..?

“డైరెక్టర్ శివనాగు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ నేటివిటీకి చాలా దగ్గరగా ఉంది. నాతో పాటు మెడిసిన్ చదువుతున్న నా ఫ్రెండ్స్ అందరం ఈ సినిమా చూశాము. అందరూ OK Go ahead అన్నారు. అందుకే ఈ సినిమాను తమిళ్ లో అనువదిస్తున్నాను” అన్నారు డాక్టర్ దివ్య సుందర వడివేలు.

తమిళ్ లో సెన్సేషనల్ స్టార్ విజయ్ నటించిన “మధురై”, మరో సెన్సేషనల్ స్టార్ సూర్య నటించిన “సింగం” చిత్రాలు ఎంత సంచలన విజయాలు సాధించాయో తమిళ, తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఆ రెండు చిత్రాల టైటిల్స్ కలిపి మా “మధురై సింగం” టైటిల్ నిర్ణయించడం జరిగింది అని చెప్పింది డాక్టర్ దివ్య సుందర వడివేలు.

అటు తెలుగులోనూ ఇటు తమిళ్ లోనూ బ్లాక్ బస్టర్ లతో సూపర్ హిట్ చిత్రాలు నిర్మిస్తున్న గోల్డెన్ హేండ్ ఎడిటర్ మోహన్ గారు “మధురై సింగం” ట్రైలర్ ని తన బంగారు హస్తాలతో లాంచ్ చేయడం మరో విశేషం.

ఎడిటర్ మోహన్ మాట్లాడుతూ.. “ట్రైలర్ లాంచ్ చేయమని నన్ను దర్శక నిర్మాతలు అడిగినప్పుడు నేను సినిమా చూస్తాను అని చెప్పాను. సినిమా చూసిన తరువాత ట్రైలర్ లాంచ్ చేశాను. మంచి కంటెంట్ ఉంది. తమిళ ప్రేక్షకులకు దగ్గరగా దర్శకుడి మేకింగ్ రీచ్ అయింది. నేచురల్ గా ఉన్న యాక్షన్ ఫ్యామిలీ డ్రామా, డైరెక్టర్ ప్రెజెంటేషన్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సిట్యుయేషనల్ సాంగ్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే దర్శక నిర్మాతలను నేను బ్లెస్ చేశాను” అన్నారు ఎడిటర్ మోహన్. ** ** **