నవంబరు 14న తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఎన్నికలు
తెలంగాణ సినీ పరిశ్రమకు అండగా, కార్మికుల సంక్షేమ సహకారం కోసం ఏర్పాటైన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గత 7 సంవత్సరాలుగా విజయవంతంగా ముందుకు సాగుతోంది. 8000 మంది సినీ కార్మికులతో, 800 ప్రొడ్యూసర్స్‌తో, 400 టీ మా ఆర్టిస్టులతో అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తోంది. ఇప్పటివరకు టిఎఫ్‌సిసి ద్వారా 140 సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యాయి. నిర్మాతలకు అత్యంత సులువుగా ప్రాసెస్ జరిపే సంస్థగా టిఎఫ్‌సిసి ప్రాచుర్యం పొందింది. లాక్ డౌన్ సమయంలో కార్డు ఉన్నా లేకపోయినా 20వేల సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా టిఎఫ్‌సిసి ద్వారా ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టిఎఫ్ సిసి సంస్థలో 15మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. వారితో పాటు పలువురి ఆర్టిస్టులకి ప్రతాని రామకృష్ణగౌడ్ గారు 5లక్షల రూపాయల హెల్త్ కార్డులను అందజేయడం విశేషం. అలాగే ఆర్టిస్టులకి ఆర్టిస్టు కార్డులను ఉచితంగా అందజేయడం రామకృష్ణ గౌడ్ గారికే చెల్లింది. ఆయన ఆధ్వర్యంలో ఎంతో మంది పేద కళాకారులకు చేయూతనిచ్చారు రామకృష్ణగౌడ్ గారు. సాయమన్న వారికి తనదైన సాయాన్ని అందించడంలో ముందుటారాయన. 152వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ ఇంటర్నేషనల్ వారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ డా.లయన్ ప్రతాని రామకృష్ణగౌడ్ గారిని సేవా భూషన్ అవార్డుతో త్యాగరాయగాణసభలో ప్రముఖుల సమక్షంలో సత్కరించారు కూడా. రీసెంట్ గా జరిగిన మా’ ఎలక్షన్లలో రామకృష్ణ గారు స్వయంగా పాల్గొని నటీనటులందరితో కలిసిమెలిసి ఈ ఎన్నికలో తన వంతు సహకారాన్ని అందించారు. అలాగే ఎంతోమంది జానపద కళాకారులని..గాయనీ గాయకులను ప్రోత్సహించే దిశగా ఆయన కృషి ఎనలేనిదనే చెప్పాలి. ప్రస్తుత ఓటీటీ యుగంలో సినీ రంగంపై ఆసక్తి పెంచే దిశగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పెద్ద ఎత్తున సినిమా అవార్డుల ఫంక్షన్‌ను టిఎఫ్‌సిసి ఆధ్వర్యంలో నిర్వహించనున్నాం.ఇక ప్రస్తుతం 30 మందితో కూడిన టిఎఫ్‌సిసి పాలక కమిటీ గడువు ముగియనుండటంతో నవంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ ఆఫీసర్ తెలియజేయనున్నారు. ఇట్లు మీ డా.లయన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఛైర్మన్ టిఎఫ్‌సిసి ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ .