తెలుగు

నవంబరు 14న జ‌ర‌గ‌నున్న తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ ఎన్నికలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

By admin

October 23, 2021

నవంబరు 14న జ‌ర‌గ‌నున్న తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామ‌ర్స్ ఎన్నికలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

తెలంగాణ సినీ ప‌రిశ్ర‌మకు అండ‌గా, కార్మికుల సంక్షేమ స‌హ‌కారం కోసం ఏర్పాటైన తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ గ‌త 7 సంవ‌త్స‌రాలుగా విజ‌యవంతంగా ముందుకు సాగుతోంది. 8000 మంది సినీ కార్మికుల‌తో, 800 ప్రొడ్యూస‌ర్స్‌తో, 400 టీ మా ఆర్టిస్టులతో అభివృద్ధి ప‌థంలో ముందుకు న‌డుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు టిఎఫ్‌సిసి ద్వారా 140 సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యాయి. నిర్మాత‌ల‌కు అత్యంత సులువుగా ప్రాసెస్ జ‌రిపే సంస్థ‌గా టిఎఫ్‌సిసి ప్రాచుర్యం పొందింది. ఇక‌ ప్ర‌స్తుతం 30 మందితో కూడిన‌ టిఎఫ్‌సిసి పాల‌క‌ క‌మిటీ గ‌డువు ముగియ‌నుండ‌టంతో న‌వంబ‌ర్ 14న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భగా డా.ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ స్థాపించి ఏడేళ్లు పూర్త‌యింది. మా ఛాంబ‌ర్ స్థాపించిన తొలినాళ్ల‌లో ఎంతో మంది అవ‌హేళ‌న చేశారు. కానీ మా ఛాంబ‌ర్ లో 8000 మంది సినీ కార్మికులు , 800 ప్రొడ్యూస‌ర్స్‌, 400 టీ మా ఆర్టిస్టులు స‌భ్యులు గా చేర‌డంతో అవ‌హేళ‌న చేసినావారే ప్ర‌శంసిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. టియ‌ఫ్‌సిసి ద్వారా లాక్ డౌన్ స‌మ‌యంలో కార్డు ఉన్నా లేక‌పోయినా 20వేల సినీ కార్మికుల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు, ఆర్థిక స‌హాయం అందించాము. అంతేకాకుండా టిఎఫ్‌సిసి ద్వారా ప్ర‌తి సంవ‌త్స‌రం ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాం. ప‌లువురు ఆర్టిస్టుల‌కి 5ల‌క్ష‌ల రూపాయ‌ల హెల్త్ కార్డుల‌ను అంద‌జేశాము. వారి పిల్ల‌ల‌కు కూడా స్కాల‌ప్ షిప్ అందిస్తున్నాం. అలాగే వారి సొంతింటి క‌ల సాకారం కోసం మా వంతు సాయంగా రెండున్న‌ర ల‌క్ష‌లు అందజేస్తున్నాం. ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణించిన వారికి రెండు ల‌క్ష‌ల భీమా అందిస్తున్నాం. ఇక ఇటీవ‌ల గౌర‌వ ముఖ్య‌మంత్రి గారిని కలిసి ఇళ్ల స్థ‌లాల కోసం విన్న‌వించుకున్నాం. త్వ‌ర‌లో 10 ఎక‌రాల ల్యాండ్ ని కేటాయిస్తామ‌ని వారు మాట కూడా ఇవ్వ‌డం జ‌రిగింది. ఇలా ఎన్నో సేవా కార్య‌క్రమాలు చేప‌డుతున్నాం. ఇక మీద‌ట కూడా చేస్తూనే ఉంటాం. ఇక ఇటీవ‌ల డాన్స్ మాస్ట‌ర్స్ యూనియ‌న్, మేక‌ప్ యూనియ‌న్, ఫైట్ మాస్ట‌ర్స్ యూనియ‌న్స్ నుంచి మా చాంబ‌ర్ స‌భ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని మా దృష్టికి రావడంతో ఆయా యూనియ‌న్స్ వారితో మాట్లాడ‌టం జ‌రిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించ‌నప్ప‌టికీ ఇక మీద‌ట ఇలాంటివి జ‌ర‌గ‌కుండా చూడాలని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. ఇక‌ ప్ర‌స్తుతం 30 మందితో కూడిన‌ టిఎఫ్‌సిసి పాల‌క‌ క‌మిటీ గ‌డువు ముగియ‌నుండ‌టంతో న‌వంబ‌ర్ 14న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎవ‌రైనా నామినేష‌న్ వేయ‌వ‌చ్చు. టియ‌ఫ్‌సిసి ఎన్నిక‌ల‌తో పాటు `తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు కూడా అదే రోజు జ‌రగ‌నున్నాయి. ఆస‌క్తిగ‌ల‌వారు ఎవ‌రైనా పోటీ చేయ‌వ‌చ్చు“అన్నారు. ఏ గురురాజ్ మాట్లాడుతూ…“టియ‌ఫ్ సిసి ప్రారంభ‌మై ఏడేళ్లు పూర్తి చేసుకుని 8000 వేల మంది స‌భ్యులుగా చేర‌డ‌మ‌న్న‌ది సాధార‌ణ‌మైన విష‌యం కాదు. మొద‌ట హేళ‌న చేసిన వాళ్లే టియ‌ఫ్‌సిసి లో స‌భ్య‌త్వం ఇప్ప‌టించ‌మంటూ ఫోన్ చేసి అడుగుతున్నారు. టియ‌ఫ్‌సిసి త‌ర‌ఫున ఎంతో మందికి ఎన్నో ర‌కాలుగా సేవ చేశాం. టియ‌ఫ్‌సిసిలో స‌భ్యుల సంఖ్య పెర‌గ‌డంతో ఎల‌క్ష‌న్స్ పెడుతున్నాం. న‌వంబ‌ర్ 14న పోటాపోటీగా ఎల‌క్ష‌న్స్ జ‌ర‌గున్నాయి. ఎవ‌రైనా పోటీ చేయ‌వ‌చ్చు“ అన్నారు. కాచెం సూర్య‌నారాయ‌ణ మాట్లాడుతూ..“టియ‌ఫ్‌సిసి ఎన్నిక‌ల‌తో పాటు `టీమా` ఎన్నిక‌లు కూడా అదే రోజు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు టీమాలో ఎంతో మంది స‌భ్యులుగా చేరారు. వారికి ఎన్నో ర‌కాల ల‌భ్దితో పాటు అవ‌కాశాలు కూడా అందిస్తున్నాం. న‌వంబ‌ర్ 14న జ‌ర‌గనున్న పోటీలో ఎవ‌రైనా పాల్గొన‌వ‌చ్చు “ అన్నారు. `టీమా` జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ స్నిగ్ధ మాట్లాడుతూ…“ఇప్ప‌టి వ‌ర‌కు టీమా లో ఎన్నో అభివృద్ధి ప‌నులు చేసాం. ఇక పైన కూడా చేస్తాం. తెలంగాణ క‌ళాకారుల‌కు అవ‌కాశాలు పెద్ద ఎత్తున ఇప్పించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాం“ అన్నారు. అడ్వ‌కేట్, ఎల‌క్ష‌న్ అధికారి కేవియ‌ల్ న‌ర‌సింహారావు మాట్లాడుతూ…“ఈ నెల 14న ఫిలింన‌గ‌ర్‌లోని టియ‌ఫ్‌సిసి కార్యాల‌యమందు టియ‌ఫ్‌సిసితో పాటు టీమా ఎల‌క్ష‌న్స్ జ‌రగనున్నాయి. అదే రోజున ఫ‌లితాలు కూడా ప్ర‌క‌టించ‌నున్నాం అంటూ ఎన్నిక‌ల షెడ్యూల్ తో పాటు ఎన్నిక‌ల‌ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు.