లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న `ఛలో ప్రేమిద్దాం` టీజర్ లాంచ్
హిమాలయ స్టూడియో మేన్సన్స్ పతాకంపై సాయి రోనక్, నేహ సోలంకి హీరో హీరోయిన్లుగా సురేష్ శేఖర్ రేపల్లే దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ నిర్మిస్తోన్న చిత్రం `ఛలో ప్రేమిద్దాం`. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను లాంచ్ చేశారు చిత్ర యూనిట్. ఒకసారి టీజర్‌లోకి వెళితే.. దొరవారు హైదరాబాద్‌కేనా.. వెళ్ళూ.. ఒక పిల్లను చూడు!! వెంటపడు.. ఆ పిల్లను పడేయ్.. సినిమాలు… షికార్లు.. తెగ తిరిగేయండి… అంటూ పోసాని కృష్ణమురళి వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది. 1.17 నిమిషాల నిడివి గల టీజర్ తో ఇది ఒక లవ్ అండ్ సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రమని దర్శకుడు సురేష్ శేఖర్ చెప్పకనే చెప్పారు. ఇప్పుడే పెళ్లయింది.. ఫోన్ మాట్లాడకండి.. మ్యాటర్ పనిచేయదని హీరోయిన్ చెప్పిన డైలాగ్‌కి కౌంటర్ గా హేమ పోసానిని ఉద్దేశించి `ఈయన మ్యాటర్ పనిచేయక చాలా సంవత్సరాలయ్యింది` అంటూ చెప్పే డైలాంగ్ తో పాటు రఘు కారుమంచి గెటప్ చూస్తుంటే ఈ చిత్రంలో కావాల్సినంత ఫన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా లవ్, రొమాంటిక్ , ఫన్ తో సందడి సందడిగా సాగిపోతున్న టీజర్ … సిజ్జు ఎంట్రీతో ఒక్కసారిగా యాక్షన్ మూడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. హీరో హీరోయిన్స్ లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.ఈ జంటను చూస్తుంటే ఫ్రెష్ అండ్ ఫీల్ గుడ్ మూవీలా కనిపిస్తోంది. డైరెక్టర్ టేకింగ్, సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉన్నాయి. భీమ్స్ అందించిన సంగీతం టీజర్‌కు అదనపు ఆకర్షణగా నిలిచింది. ఓవరాల్‌గా సినిమా యూత్‌తో పాటు అన్ని రకాల ఆడియెన్స్‌కి నచ్చేలా ఉండబోతోందని టీజర్ తో అర్థమైంది. ఇటీవల ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ విడుదలై యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కామెంట్స్ తో దూసుకుపోతుంది. త్వరలో మిగతా సాంగ్స్ విడుదల చేసి సినిమాను ఈ నెల్లోనే గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
శశాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, బాహుబలి ప్రభాకర్, హేమ, రఘు కారుమంచి, సూర్య, తాగుబోతు రమేష్, అనంత్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః భీమ్స్ సిసిరోలియో ; పాటలుః సురేష్ గంగుల, దేవ్, ఎడిటింగ్ః ఉపేంద్ర జక్క; ఆర్ట్ డైరక్టర్ః రామాంజనేయులు; పీఆర్వోః రమేష్ చందు, నగేష్ పెట్లు, ఫైట్స్ః నభా-సుబ్బు, కొరియోగ్రఫీః వెంకట్ దీప్; సినిమాటోగ్రఫీః అజిత్ వి.రెడ్డి, జయపాల్ రెడ్డి; నిర్మాతః ఉదయ్ కిరణ్, రచన-దర్శకత్వంః సురేష్ శేఖర్ రేపల్లె.