తెలుగు

“ఛలో ప్రేమిద్దాం” మూవీ రివ్యూ

By admin

November 19, 2021

“ఛలో ప్రేమిద్దాం” మూవీ రివ్యూ

నటీనటులు – సాయి రోనక్, నేహా సోలంకి, శ‌శాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి ర‌ఘుబాబు, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, హేమ‌, ర‌ఘు కారుమంచి, సూర్య‌ తదితరులు టెక్నీషియన్స్ – సంగీతం – భీమ్స్ సిసిరోలియో, పాట‌లు – సురేష్ గంగుల‌, దేవ్‌, ఎడిటింగ్ – ఉపేంద్ర జ‌క్క‌, సినిమాటోగ్ర‌ఫీ – అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి నిర్మాత –  ఉద‌య్ కిర‌ణ్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం – సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె

రేటింగ్ః 3.25/5

ప్ర‌తి వారం ఆరేడు సినిమాల‌కు త‌గ్గ‌కుండా విడుద‌ల‌వుతున్నాయి. ఇక ఈ వారం దాదాపు తొమ్మిది ప‌ది చిత్రాలు విడుద‌ల‌య్యాయి. అందులో ముందు నుంచి టీజ‌ర్‌తో ట్రైల‌ర్ తో పాట‌ల‌తో ఆక‌ట్టుకున్న చిత్రం `ఛ‌లో ప్రేమిద్దాం`. మ‌రి ఈ రోజు విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం…

క‌థా క‌మామీషుః అన్నింట్లో సిన్సియ‌ర్ గా ఉండే ఆత్మారావు (సాయి రోనక్ హీరో)  కాలేజ్ చ‌దువు కోసం  హైద‌రాబాద్ వెళ‌తాడు. ఎప్పుడూ చ‌లాకీగా ఉండే  అదే కాలేజ్ లో చదివే మధుమతి రావు కి ప‌రిచ‌యం అవుతుంది. ఆ పరిచ‌యం కాస్త ప‌రిణ‌యంగా ప్రేమ‌గా పెరిగి పెద్ద‌ద‌వుతుంది.  రావు  మంచి మనసుకు పడిపోతుంది మధుమతి. కానీ మనసులో ఉన్న ప్రేమను చెప్పదు. ఎందుకంటే దానికి కారణం ఆమె కుటుంబ నేపథ్యం. ఆత్మారావుతో లవ్ ప్రపోజ్ ఓకే చేయకుండానే ఊరెళ్లిపోతుంది మధుమతి. ఆమె సోదరి పెళ్లికి ఆత్మారావుతో సహా స్నేహితుల బృందమంతా క‌లిసి రాయ‌ల‌సీమ  వెళ్తుంది. అక్క‌డ హీరోయిన్ కిడ్నాప్ అవుతుంది. అస‌లు అక్క‌డ ఏం జ‌రిగింది?  హీరోయిన్ ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు?  హీరో హీరోయిన్ చివ‌ర‌కు క‌లుసుకున్నారా?  లేదా అనేది సినిమా. ఆర్టిస్ట్స్- టెక్నీషియ‌న్స్ ప‌నితీరుః ఆత్మారావు క్యారెక్టర్ లో సాయి రోనక్ మెప్పించాడు. సరదా, ఛలాకీ కుర్రాడిగా ఆకట్టుకున్నారు. మధుమతిగా నేహా సోలంకి మ్యాజిక్ చేసేసింది. సినిమాకు ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. నాగినీడుకు పెద్దప్ప క్యారెక్టర్ టైలర్ మేడ్. ఆయన చాలా సులువుగా ఈ పాత్ర పోషిస్తూ వెళ్లారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల మేరకు అద్భుతంగా నటించారు. విశ్లేషణ‌లోకి వెళితే… ఛలో ప్రేమిద్దాం ఒక చక్కటి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఆహ్లాదంగా ఫీలవుతారు. సరదాగా సాగే కాలేజ్ సీన్స్, యువ జంట ప్రేమ కబుర్లు, స్నేహితుల నవ్వించే మాటలు…ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. అనవసర మలుపులు ఉండవు. పాటలు, ఫైట్స్ లాంటి అన్ని కమర్షియల్ హంగులతో  ఛలో ప్రేమిద్దాం చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సురేష్ శేఖర్. దుబాయ్ లో చిత్రీకరించిన పాట‌లు  సినిమాకు హైలైట్. ఒక చిన్న సినిమాకు దుబాయ్ లో పాట పిక్చరైజ్ చేసిన నిర్మాత ఉదయ్ కిరణ్ కు సినిమా మీదున్న ఇష్టమెంతో తెలిసిపోతుంది. ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లోలాగే  ఈ ప్రేమ కథకు కూడా రాయలసీమ బ్యాక్ డ్రాప్ కలిపారు. కాలేజ్, లవ్ సరదా ఎపిసోడ్స్ కు..సెకండాఫ్ రాయలసీమ నేపథ్యం యాక్షన్ బ్యాడ్రాప్ కు సరిగ్గా బ్యాలెన్స్ అయ్యింది. దీంతో ఆద్యంతం ఎంగేజింగ్ గా ఛలో ప్రేమిద్దాం తయారైంది. భీమ్స్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. ఎడిటింగ్, సినిమాటోగ్రపీ పర్పెక్ట్ గా ఉన్నాయి. హిమాలయ స్టూడియో మాన్షన్స్ మేకింగ్ వ్యాల్యూస్ హై లెవెల్లో ఉన్నాయి. సినీ ప్రియులకు ఫుల్ మీల్స్ లాంటి చిత్రమిది. ఈ వారం అన్ని వ‌య‌సుల వారు ఛ‌లో ప్రేమిద్దాం అనేయ‌చ్చు.