`ఈగిల్ ఐ` ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మరో చిత్రానికి సన్నాహాలు!
నరేన్ వనపర్తి హీరోగా పరిచయం అవుతూ రూపొందిన `ఊరికి ఉత్తరాన` చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇటు విమర్శకుల నుంచి అటు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈగిల్ ఐ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-2గా మరో చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈచిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావొచ్చింది. ఈ సందర్భంగా హీరో , చిత్ర సమర్పకులు నరేన్ వనపర్తి మాట్లాడుతూ… మా“ఊరికి ఉత్తరాన` చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. కొత్తవారైనా కంటెంట్ ఉంటే సినిమాను ఆదరిస్తారని మా చిత్రం మరోసారి నిరూపించింది. `ఊరికి ఉత్తరాన` సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఈగిల్ ఐ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-2 గా మరో చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్ ప్రకటిస్తాం“ అన్నారు.