“పల్లె గూటికి పండగొచ్చింది” మోషన్ పోస్టర్ విడుదల
కే ప్రవీణ్ సమర్పణలో దివ్య తేజస్విని పతాకంపై రోహిత్ కృష్ణ సంతోష్ నిఖిత హర్షిత నటీనటులుగా తిరుమల్ రావు దర్శకత్వంలో కె లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం “పల్లె గూటికి పండగొచ్చింది”. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను హైదరాబాదులోని ఫిల్మ్ ఛాంబర్ లోని పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు.
అనంతరం జరిగిన సమావేశంలో చిత్ర దర్శకుడు తిరుమల్ రావు మాట్లాడుతూ . పల్లెల్లో ఉన్న యువత ఏ రకంగా చెడు మార్గం లో వెళుతున్నారు.వారి ప్రవర్తనను మంచి మార్గంలో చేసుకుంటే ప్రభుత్వ సహకారం లేకుండానే ఎలా స్మార్ట్ విలేజ్ చెయ్యచ్చు అనేదే చిత్ర కథాంశం. నిజంగా రాజకీయ నాయకుల సహకారం లేకుండా కూడా ఒక పల్లె ను ఏ రకంగా అభివృద్ధి పథంలో నడిపించవచ్చు అనే మెయిన్ పాయింట్ గా తీసుకొని మంచి కాస్టింగ్ తో చాలా బాగా చేశాము.పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.ఫిబ్రవరి లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను ఒక తల్లి కొడుకు,తండ్రి కూతురు ఇలా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా..చూడదగ్గ సినిమా..ఈ సినిమా చాలా బాగా వచ్చింది.ఇందులోని క్లైమ్యాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. క్లైమాక్స్ చూసిన వారంతా షాక్ అవుతారు అలాగే ఆస్వాదిస్తారు.ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని ఆన్నారు.