తలసాని చేతుల మీదుగా తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ వారు రూపొందించిన సంక్రాంతి సాంగ్ లాంచ్
తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ (టియఫ్‌సీసీ) వారు బతుకమ్మ, దసర, దీపావళి, సంక్రాంతి, ఉగాది ఇలా ప్రతి పండుగకు ఒక పాట రూపొందించి విడుదల చేస్తుంటారు. ఇప్పటికే చేసిన ఎన్నో పాటలు ప్రజాదరణ పొందాయి. ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సారి కూడా ఒక అద్భుతమైన పాటను రూపొందించారు. రాజ్ కిరణ్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటను గీతామాధురి ఆలపించారు. ఈ పాటను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…“తెలంగాణ ఫిలించాంబర్ ఆఫ్ కామర్స్ వారికి బతుకమ్మ దసర, దీపావళి, సంక్రాంతి, ఉగాది ఇలా ప్రతి పండగకు దాని విశిష్టతను తెలియజేస్తూ మంచి పాటలు చేసే ఆనవాయితీ ఉంది. ఈ సందర్భంగా టియఫ్‌సీసీ ఛైర్మన్ రామకృష్ణగౌడ్ గారిని అభినందిస్తున్నా. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి కూడా ఒక మంచి సాంగ్ చేశారు. ఈ పాటను నా చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా ఆనందంగ ఉంది. గీతామాధురి అద్భుతంగా పాడింది. పిక్చరైజేషన్ గా కూడా సంక్రాంతి పండుగ ఎంత సందడిగా ఉంటుందో అంత సందడిగా కలర్‌ఫుల్ గా తీర్చిదిద్దారు. కొత్త సంవత్సరంలో రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ పాట ఉంది అనడంతో సందేహం లేదు. ఇలాగే ఇంకా ఎన్నో మంచి పాటలు తెలంగాణ ఫిలించాంబర్ వారు రూపొందించాలని కోరుకుంటూ ఈ పాట కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నా“ అన్నారు. లయన్ డా.ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ…“ప్రతి పండుగకు మా చాంబర్ తరపున పాటలు చేయిస్తున్నాం. ఇప్పటికి చాలా పాటలు చేశాం. మంగ్లీ, గీతామాధురి, మధుప్రియ, ఆదర్శిని, రమ్య బెహర ఇలా ప్రముఖ సింగర్స్ తో పాటలు పాడించాం. అన్ని పాటలు ప్రజాదరణ పొందాయి. ఈ సంక్రాంతికి చేసిన పాటను గీతా మాధురి అద్భుతంగా పాడింది. ఈ పాటను రెండు రోజుల పాటు బొటానికల్ గార్డెన్ లో షూట్ చేశాను. బొటానికల్ గార్డెన్ లో షూట్ చేయడానికి ఛైర్మన్ ప్రతాపరెడ్డి గారు ఎంతో సహకరించారు. పాటను అందరూ విని ఈ సంక్రాంతిని మరింత ఆనందంగా జరుపుకుంటారని కోరుకుంటున్నా“ అన్నారు. ఈ పాటకు రాజ్ కిరణ్ సంగీతం సమకూర్చగా హరి సాహిత్యాన్ని సమకూర్చారు. గీతామాధురి ఆలపించారు. రాజశేఖర్ ఎడిటర్ గా వ్యవహరించారు.