‘రియల్ దండుపాళ్యం` ట్రైలర్ లాంచ్ జనవరి 21న విడుదల!
‘రియల్ దండుపాళ్యం` ట్రైలర్ లాంచ్జనవరి 21న విడుదల
రామ్ ధన్ మీడియా వర్క్స్ సమర్పణలో శ్రీ వైష్ణో దేవి పతాకంపై రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం `రియల్ దండుపాళ్యం`. మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి, రామ్ధన్ మీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 21న వరల్డ్ వైడ్గా రామ్ధన్ మీడియా వర్క్స్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పాత్రికేయులు, నిర్మాత సురేష్ కొండేటి ట్రైలర్ లాంచ్ చేశారు.
అనంతరం సురేష్ కొండేటి మాట్లాడుతూ…“దండుపాళ్యం సిరీస్ తెలుగు, కన్నడ భాషల్లో సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. వాటిని మించేలా `రియల్ దండుపాళ్యం` చిత్రం ఉండబోతుందని ట్రైలర్ చూశాక అర్థమైంది. రాగిణి ద్వివేది అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరించింది. ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న వాల్మీకి ఈ చిత్రంతో సినిమా రంగంలో కూడా సక్సెస్ సాధించి మరెన్నో చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నా“ అన్నారు.
రామ్ ధన్ మీడియా వర్క్స్ అధినేత వాల్మీకి మాట్లాడుతూ…“తెలుగు, కన్నడ భాషల్లో దండుపాళ్యం సిరీస్ గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వాటన్నింటినీ మించేలా `రియల్ దండుపాళ్యం ఉండబోతుంది`. సొసైటీలో మగాళ్ళ వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ ‘రియల్ దండుపాళ్యం’. ప్రతి సన్నివేశాన్ని ఎంతో రియలిస్టిక్ గా తెరకెక్కించాడు దర్శకుడు మహేష్. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నో సంఘటనలకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉంటుంది. అన్ని సెంటర్స్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుందన్న నమ్మకం ఉంది. ఈ నెల 21న సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఇది ఓటీటీలో కన్నా మంచి సౌండ్ సిస్టమ్ తో థియేటర్స్ లో చూడాల్సిన చిత్రం కాబట్టి థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తున్నాం. మా చిత్రాన్ని ఆదరించి మరెన్నో చిత్రాలు నిర్మించే అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.
నిర్మాత సి.పుట్టస్వామి మాట్లాడుతూ…“ మా చిత్రం నచ్చి రామ్ థన్ మీడియా వర్స్క్ వారు వరల్డ్ వైడ్ గా సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. రియల్ ఇన్సిడెంట్స్ కు దగ్గరగా రియల్ దండుపాళ్యం ఉంటుందన్నారు.
రాగిణి ద్వివేది, మేఘన రాజ్, దీప్తి, ప్రధమ ప్రసాద్, సంయుక్త హర్నడ్, యువరాజ్, రఘు బట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్ః కోయల్ బంజార; పీఆర్వోః చందు రమేష్; నిర్మాతలుః సి.పుట్టస్వామి, రామ్ధన్ మీడియా వర్క్స్; దర్శకత్వంః మహేష్.