అమెజాన్ ప్రైమ్ లో టాప్ 3లో ట్రెండ్ అవుతున్న రావణలంక
అమెజాన్ ప్రైమ్ లో టాప్ 3లో ట్రెండ్ అవుతున్న రావణలంక
సినిమా కథలో స్టఫ్ ఉండాలే గానీ ఆ సినిమా విజయాన్ని ఆపడం ఎవ్వరితరం కాదు. ఒకప్పటిలా కాకుండా ప్రేక్షకుల ధోరణి, అభిరుచిలో క్రమంగా మార్పు చోటుచేసుకుంది. కంటెంట్ బలంగా ఉన్న సినిమాలకు భారీ ప్రేక్షకాదరణ దక్కుతుండటం చూస్తున్నాం. స్టార్ హీరోలే కాదు టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరినీ జనం ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. దీనికి తోడు ఓటీటీ వేదికల పరిధి విస్తరించడం అప్‌కమింగ్ హీరోలకు వరంగా మారింది. ఈ క్రమంలోనే రీసెంట్గా థియేటర్స్‌లో విడుదలై సూపర్ రెస్పాన్స్ అందుకున్న ‘రావణలంక’ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన తెచ్చుకుంటోంది.
కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్‌పై బి.ఎన్.ఎస్ రాజు దర్శకత్వంలో యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా ఈ ‘రావణలంక’ మూవీ విడుదలైంది. ఈ సినిమాలో హీరోగా నటించిన క్రిష్ బండిపల్లి స్వయంగా నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టడం విశేషం. చిత్రంలో క్రిష్ జోడీగా అశ్విత, త్రిష నటించారు. సీనియర్ నటులు మురళి శర్మ, దేవ్ గిల్ ప్రధాన పాత్రలు పోషించారు.
నవంబర్ 19న 150 థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తర్వాత జనవరి 5న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ ప్రతి రోజు దాదాపు 5 లక్షల వ్యూస్‌తో టాప్ 3లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో యంగ్ హీరో క్రిష్ నటన చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పట్టుదలతో, సినిమా అంటే ప్యాషన్‌తో ఓ నిర్మతగా, హీరోగా తన మార్క్ చూపించారు క్రిష్ బండిపల్లి. ఈ సినిమాలో ఆయన నటన చూసి పలువురు సినీ పెద్దలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. దీంతో ఆయనకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పటికే క్రిష్‌తో మరో రెండు సినిమాలు కన్ఫర్మ్ చేశారు. ఇంత టాలెంట్‌తో పాటు సినిమాల పరంగా గొప్ప గొప్ప విజయాలు సాధించాలనే తపన ఉన్న క్రిష్‌కి పెద్ద డైరెక్టర్స్ ఆఫర్స్ ఇవ్వాలే గానీ స్టార్ స్టేటస్ పట్టేస్తాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
సినిమాల్లో నటించడమే కాదు రిలీజ్ చేసుకునే సత్తా, మార్కెటింగ్ చేసుకునే సామర్ధ్యం ఉన్న వ్యక్తి క్రిష్ బండిపల్లి అని, అతి త్వరలో కెరీర్లో గొప్ప మైలురాయిని చేరుకుంటాడని అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు. కథను ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అని అంచనా వేయడం మొదలుకొని నిర్మాణ బాధత్యలు చేపట్టి ఎలాగైనా సినిమాను రిలీజ్ చేసే వరకు కష్టపడటం క్రిష్‌లో ఉన్న మరో ప్రత్యేక లక్షణం. అందుకే ముందు ముందు ఆయన మరిన్ని మంచి సినిమాలతో దూసుకుపోతారనేది పలువురు వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.
రావణలంక నటీనటలు – క్రిష్, అశ్మిత, త్రిష, మురళిశర్మ, దేవ్ గిల్ తదితరలు
బ్యానర్- కే సిరీస్ మ్యూజిక్ ఫ్యాక్టరీ
డైరెక్టర్- బిఎన్ఎస్ రాజు
నిర్మాత- క్రిష్ బండిపల్లి
మ్యూజిక్- ఉజ్జల్
సినిమాటోగ్రఫి- హజరత్ షేక్ (వలి)
ఎడిటర్- వినోద్ అద్వయ్