తెలుగు

సిరి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న తొలి చిత్రం ప్రారంభం

By admin

February 06, 2022

సిరి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న తొలి చిత్రం ప్రారంభం

సిరి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న తొలి చిత్రం ప్రారంభోత్సవ వేడుకలు రాయల్ పవేలియన్ అపార్ట్మెంట్ ఆవరణలోని లక్ష్మీ గణపతి ఆలయంలో ఆదివారం ప్రారంభమైంది. ఈ చిత్రానికి తొలి సీను పై రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ అమరావతి లక్ష్మీనారాయణ గారు క్లాప్ కొట్టి ప్రారంభించారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సభ మీడియా కమిటీ చైర్మన్ శ్రీ ఆగిరి వెంకటేష్ గారు రెండవ సీన్ పై క్లాప్ కొట్టారు .

ఈ చిత్రానికి నిర్మాతగా సిరిపురం లావణ్య, దర్శకునిగా సిరిపురం రాజేశ్ వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా కొనసాగనున్న ఈ సినిమాకు కథ కాశి రాయడం జరిగింది. ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా నరహరి దేవరకొండ గారు అలాగే కో డైరెక్టర్గా శ్రావణ్, సూర్య వ్యవహరిస్తున్నారు. కుమారి వినీషా ,శ్రీమతి శైలజ ,విష్ణులతో పాటు నూతన తారాగణంతో నిర్మాత ఈ సినిమాను నిర్మిస్తున్నారు.