సెన్సేషనల్ డైరక్టర్ వీవీ వినాయక్ క్లాప్ తో `ఓసీ`షూటింగ్ ప్రారంభం!!

కౌండిన్య ప్రొడక్షన్స్ పతాకంపై కిరణ్ లోవ, లక్ష్మి కిరణ్, హరీష్ బొంపల్లి, మంజీర ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం `ఓసీ`. కిరణ్ &విష్ణు దర్శకులు. విష్ణు శరణ్ బొంపల్లి నిర్మాత. ఈ రోజు ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెన్సేషనల్ డైరక్టర్ వీవీ వినాయక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా ముని రాజ్ గుత్తా కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సత్య మాస్టర్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా హీరో, దర్శకుడు కిరణ్ లోవ మాట్లాడుతూ…“ నేను నటిస్తూ, దర్శకత్వం వహిస్తోన్న చిత్రానికి ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ గారు వచ్చి క్లాప్ కొట్టడం మా తొలి సక్సెస్ గా భావిస్తున్నాం. ఇప్పటి వరకు నేను తెలుగు, తమిళ భాషల్లో కలిపి హీరోగా 18 చిత్రాలు చేశాను. `ఓసీ` చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా డైరక్షన్ కూడా చేస్తున్నా. నా పద్దెనిమిదేళ్ల అనుభవంతో ఈ చిత్రాన్ని ఒక బ్లాక్ బస్టర్ చిత్రంగా రూపొందించడానికి శాయశక్తులా కృషి చేస్తాను. విష్ణు నన్ను నమ్మి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాడు. ఈ సినిమా కోసం ముఫ్పై కథలు చెప్పాను. ఓసీ కథ నచ్చడంతో సినిమా ప్రారంభించాం. టెక్నీషియన్స్ అంతా అనుభవంతో పాటు ఎంతో ప్రతిభావంతులు మా చిత్రానికి పని చేస్తున్నారు. “విషయం ఉన్నవాడు విలేజ్ లో ఉన్నా ఏదైనా సాధించగలడు“ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. మరో రెండు వారాల్లో షెడ్యూల్ ప్రారంభిస్తాం. షూటింగ్ అంతా హైదరాబాద్ లో నే కంప్లీట్ చేయనున్నాం. టీమ్ వర్క్ గా ఈ సినిమా చేస్తున్నాం“అన్నారు.
నిర్మాత విష్ణు శరణ్ బొంపల్లి మాట్లాడుతూ…“నేను నిర్మిస్తోన్న తొలి చిత్రానికి వినాయక్ గారు క్లాప్ కొట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ముప్పై కథలు విన్నాను. ఓసీ కథ నచ్చి నిర్మిస్తున్నా. ఈ సినిమాతో నా సోదర సమానుడైన కిరణ్ ని స్టార్ హీరోగా నిలబెడుతూ బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వడానికి కృషి చేస్తాను. కథే హీరోగా ఈ సినిమా ఉంటుంది. టాలెంటెడ్ టీమ్ మా చిత్రానికి సెట్టయ్యారు. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.
సత్య మాస్టర్ మాట్లాడుతూ…“ఒక మంచి టీమ్ చేస్తోన్న సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
రైటర్ లక్ష్మి కిరణ్ మాట్లాడుతూ…“ఒక మంచి కథకు మంచి టీమ్ కుదిరింది“ అన్నారు.
సంగీత దర్శకులు అక్షర్ బ్యాండ్ మాట్లాడుతూ…“మేము ఇప్పటి వరకు చాలా పబ్స్ లో ప్రోగ్రామ్స్ ఇచ్చాం. ఒకరోజు డైరక్టర్ కిరణ్ గారు మ్యూజిక్ డైరక్షన్ చాన్స్ ఇస్తా అని మాటిచ్చారు. మాట ప్రకారం ఈ సినిమా ఇచ్చారు. ఈ సినిమా కోసం మంచి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాం“ అన్నారు.
నటుడు హరీష్ మాట్లాడుతూ…“ నిర్మాణ వ్యవహారాలతో పాటు ఈ సినిమాలో నేను కూడా మంచి పాత్ర చేస్తున్నా“ అన్నారు.
కిరణ్ లోవ, లక్ష్మి కిరణ్, హరీష్ బొంపల్లి, మంజీర, నట్రాజ్, మధు, వంశీ గౌడ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి స్టోరిః లక్ష్మి కిరణ్, డిఓపిః నట్రాజ్ అయాన్; కొరియోగ్రాఫర్స్ః సత్య, మోహన్ కృష్ణ, వంశీ గౌడ్; సంగీతంః అక్షర్ బ్యాండ్ పివియల్యన్ మూర్తి, ఆరోన్; పీఆర్వోః రమేష్ చందు; నిర్మాతః విష్ణు శరణ్ గౌడ్ బొంపల్లి, దర్శకత్వంః కిరణ్ అండ్ విష్ణు.