తెలుగు

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం!!!

By admin

March 08, 2022

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం!!!

50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా సురేష్ కొండేటి, ఉపాధ్యక్షులుగా ఆర్.డి.ఎస్.ప్రకాష్, సురేష్ కవిరాయని జనరల్ సెక్రెటరీగా ఎం. లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా ఎస్. నారాయణరెడ్డి ఎం.డి. అబ్దుల్, ట్రెజరర్ పి.హేమసుందర్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా: తాటికొండ కేశవాచారి, వీర్ని శ్రీనివాసరావు, టి. మల్లిఖార్జున్, రమేష్ చందు, ధీరజ్ అప్పాజీ, నవీన్, రవి గోరంట్ల ఎన్నికయ్యారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బి.ఏ. రాజు, జ‌య గార్ల గౌర‌వార్థం వారి కుమారుడు బి.ఏ. శివ‌కుమార్ ను ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మెంబ‌ర్ గా.. అలాగే క‌మిటీ ఆమోదంతో ఈసీ మెంబ‌ర్ గా తీసుకోవ‌డం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ… ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇది 50 సంవ‌త్స‌రాల చ‌రిత్ర గ‌ల అసోసియేష‌న్. నిజ‌మైన ఫిల్మ్ జ‌ర్న‌లిస్టులు అనేది ప్రారంభ‌మైంది ఈ సంస్థ ద్వారానే. తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ కు ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. నేను జ‌ర్న‌లిస్ట్ గా వ‌చ్చిన‌ 1991వ సంవ‌త్స‌రంలో ఈ అసోసియేష‌న్ గురించి విన్నాను. అప్పుడు ఈ అసోసియేష‌న్ లో మెంబ‌ర్ గా ఉండాల‌నుకున్నాను. కృష్ణ ప‌త్రిక‌లో ఉన్న‌ప్పుడు మెంబ‌ర్ అవ్వాల‌నుకున్నాను జ‌ర‌గ‌లేదు. వార్త దిన‌ప‌త్రిక‌లో వ‌ర్క్ చేసిన‌ప్పుడు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ లో మెంబ‌ర్ అయ్యాను. ఆ విధంగా ఆ కోరిక నెర‌వేరింది.

అప్పుడు అసోసియేష‌న్ ప్ర‌తి మీటింగ్ కి హాజ‌ర‌య్యేవాడిని. అప్పుడు గుడిపూడి శ్రీహ‌రి గారు.. ల‌క్ష్మ‌ణ‌రావు గారు.. ఇలా పెద్ద పెద్ద వాళ్లు నాకు ఇన్ స్పిరేష‌న్ క‌లిగించారు. నేను కూడా ఎప్పుడైనా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ లో ఏదొక పోస్ట్ లో ఉండాలి అనుకున్నాను. అలాంటిది లాస్ట్ టైమ్.. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ గా రెండు సంవ‌త్స‌రాలు చేశాను. క‌రోనా టైమ్ లో ప్రెసిడెంట్ గా స‌భ్యుల‌కు సేవ చేసే అవ‌కాశం అనేది ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేనిది. ఆ టైమ్ లో మెంబ‌ర్స్ కి స‌హాయం చేసే అవ‌కాశం రావ‌డం అనేది అదృష్టంగా భావించాను. అప్పుడు ఒక్క జ‌ర్న‌లిస్టుల‌కే కాదు.. ప్ర‌పంచానికే క‌ష్టం వ‌చ్చింది. సిసిసి ద్వారా అలాగే త‌ల‌సాని శ్రీనివాస్ గారు కూడా జ‌ర్న‌లిస్టుల‌కు స‌హాయం చేయ‌డం జ‌రిగింది. సినిమా రంగానికి 24 క్రాఫ్టులు ఉంటే.. సినిమా జ‌ర్న‌లిస్టులు అనేది 25 క్రాఫ్టు అవ్వాల‌ని కోరుకుంటున్నాను. ఆ టైమ్ లో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు రెండు ద‌ఫాలుగా ఆర్థిక స‌హాయం చేయ‌డం జ‌రిగింది.

50 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన ఈ అసోసియేష‌న్ ఫ‌స్ట్ టైమ్ మెంబ‌ర్స్ అంద‌రికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేయ‌డం జ‌రిగింది. అలాగే మెంబ‌ర్స్ ఎవ‌రైనా చ‌నిపోతే 25,000 ఇవ్వాల‌ని అప్పుడు తీర్మానించుకోవ‌డం.. ఇవ్వ‌డం జ‌రిగింది. ఇలా ఎన్నెన్నో కార్య‌క్ర‌మాలు చేశాం. ఇప్పుడు మ‌ళ్లీ ఏక‌గ్రీవంగా రెండోసారి నన్ను ప్రెసిడెంట్ ని చేయ‌డం అనేది చాలా సంతోషంగా ఫీల‌వుతున్నాను. నా మీద అంత న‌మ్మ‌కం ఉంచినందుకు మ‌న‌స్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. గ‌తంలో నేను ఎలాగైతే సంస్థ అభివృదికి.. స‌భ్యుల‌కు సంక్షేమానికి కృషి చేశానో.. ఇప్పుడు ఈ క‌మిటీలో ఉన్న స‌భ్యులంద‌రి స‌హ‌కారంతో ఇంకా మంచి ప‌నులు చేయాల‌ని.. చేస్తాన‌ని మాట ఇస్తున్నాను. ప్ర‌తి మెంబ‌ర్ కి ఉప‌యోగ‌ప‌డేలా నిర్ణ‌యాలు.. క‌మిటీ స‌భ్యుల ఆమోదంతో తీసుకోవ‌డం జ‌రుగుతుంది. సినిమా జ‌ర్న‌లిస్టుల అసోసియేష‌న్లో కీల‌క‌మైంది మాత్రం ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అని నేను ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌లుతాను అన్నారు.

జనరల్ సెక్రెటరీగా ఎం. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… 50 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ 2022 – 2024 సంవ‌త్స‌రాల‌కు సంబంధించి జ‌రిగిన ఎన్నిక‌లు ఏక‌గ్రీవంగా జ‌ర‌గ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ సంద‌ర్భంగా స‌భ్యులంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను. ప్రెసిడెంట్, కార్య‌దర్శి, కోశాధికారితో పాటు ఈసీ స‌భ్యుల‌ను కూడా ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డం జ‌రిగింది. అసోసియేష‌న్ అభివృద్ధి కోసం ఏం చేయ‌బోతున్నాం అనేది త్వ‌ర‌లోనే తెలియ‌చేస్తాం అన్నారు.

వైస్ ప్రెసిడెంట్ సురేష్ క‌విరాయ‌ని మాట్లాడుతూ… న‌న్ను వైస్ ప్రెసిడెంట్ గా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. 50 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ ఇది. ప్రాచుర్యం.. ప్రాధాన్యం.. అసోసియేష‌న్ ఇది. ఇటు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు, అటు అసోసియేష‌న్ మెంబ‌ర్స్ కి మేలు జ‌రిగేట్టు ఈ కొత్త కార్య‌వ‌ర్గం ముందుకు అడుగు వేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

వైస్ ప్రెసిడెంట్ ఆర్.డి.ఎస్ ప్ర‌కాష్ మాట్లాడుతూ.. 1996 నుంచి ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ గా ఉన్నాను. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్లో నాలుగుసార్లు ఈసీ మెంబ‌ర్ గా వ‌ర్క్ చేశాను. ప్ర‌స్తుతం సురేష్ కొండేటి గారి అధ్య‌క్షుడుగా ఉన్న ఈ క‌మిటీలో నన్ను ఉపాధ్య‌క్షుడుగా ఎన్నుకోవ‌డం జ‌రిగింది. స‌భ్యులంద‌రి స‌హ‌కారంతో మా టీమ్ మెంబ‌ర్స్ అంద‌రం కూడా ఈ అసోసియేష‌న్ అభివృద్దికి కృషి చేస్తామ‌ని తెలియ‌చేస్తున్నాను అన్నారు.

జాయింట్ సెక్ర‌ట‌రీ ఎం.డి. అబ్ధుల్ మాట్లాడుతూ… సుధీర్ఘ చ‌రిత్ర గ‌ల ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ ఎన్నో బాధ్య‌త‌ల‌ను.. స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తుంది. న‌న్ను జాయింట్ సెక్ర‌ట‌రీగా ఎన్నుకున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేస్తున్నాను. సంస్థ చేసే ప్ర‌తి కార్య‌క్ర‌మంలో తోడుగా ఉంటూ సంస్థ అభివృద్దికి ఎంత‌గానో స‌హ‌క‌రిస్తాన‌ని తెలియ‌చేస్తున్నాను అన్నారు.

కోశాధికారి హేమ సుంద‌ర్ మాట్లాడుతూ… 2000 సంవ‌త్స‌రం నుంచి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్లో స‌భ్యుడుగా ఉన్నాను. ఈనాడులో సినిమా జ‌ర్న‌లిస్ట్ గా వ‌ర్క్ చేశాను. ఆత‌ర్వాత వెబ్ జ‌ర్న‌లిస్ట్ గా వ‌ర్క్ చేసాను. ఇప్పుడు డిజిట‌ల్ జ‌ర్న‌లిజంలో ఉన్నాను. 2019లో ఈసీ మెంబ‌ర్ గా వ‌ర్క్ చేశాను. అలాగే గ‌త ఎన్నిక‌ల్లో కూడా కోశాధికారి బాధ్య‌త‌ను చేప‌ట్టాను. ఈసారి ఏక‌గ్రీవంగా కోశాధికారిగా ఎన్నుకున్నారు. ఆర్థిక లావాదేవీల విష‌యంలో చాలా పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని మీ న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌న‌ని హామీ ఇస్తున్నాను అన్నారు.

ఈసీ మెంట‌ర్ న‌వీన్ మాట్లాడుతూ.. ఇండ‌స్ట్రీలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అనేది చాలా ముఖ్య‌మైన‌ది. సినిమా ప‌త్రిక‌లు నంబ‌ర్ వ‌న్ కానీ.. సితార కానీ.. సూప‌ర్ హిట్ కానీ.. అలాగే సంతోషం కానీ.. ఇలా సినిమా ప‌త్రిక‌ల్లో వార్త‌లు, ఫోటోలు రావ‌డం వ‌ల‌నే అప్ప‌ట్లో సినిమాల గురించి సామాన్య జ‌నాల‌కు తెలిసేవి. అలాగే ఎంతో మంది సినీస్టార్స్ అవ్వడంలో సినీ జ‌ర్న‌లిస్టులు ముఖ్య‌పాత్ర పోషించారు అన‌డంలో సందేహం లేదు. నేను 20 సంవ‌త్స‌రాల నుంచి ఇండ‌స్ట్రీలో వ‌ర్క్ చేస్తున్నాను. నేను ఈసీ మెంబ‌ర్ గా ఉండ‌డం చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో ఈ అసోసియేష‌న్ స‌భ్యుల సంక్షేమం కోసం మ‌రింత‌గా కృషి చేయాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

ఈసీ మెంబ‌ర్ ధీర‌జ అప్పాజీ మాట్లాడుతూ… సురేష్ కొండేటి గారి సార‌ధ్యంలో స‌భ్యులంద‌రి స‌హ‌కారంతో.. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ గోల్డ‌న్ జూబ్లీ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకోవాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఈసీ మెంబ‌ర్ కేశ‌వాచారి మాట్లాడుతూ… సురేష్ కొండేటి గారి ఆధ్వ‌ర్యంలో ఈసీ మెంబ‌ర్ గా న‌న్ను ఎన్నుకున్నందుకు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను అన్నారు.

ఈసీ మెంబ‌ర్ వీర్ని శ్రీనివాస‌రావు మాట్లాడుతూ…. 2004 నుంచి ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో రెండుసార్లు ఈసీ మెంబ‌ర్ గా వ‌ర్క్ చేశాను. ఇప్పుడు మూడోసారి ఈ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ నూత‌న క‌మిటీలో న‌న్ను ఈసీ మెంబ‌ర్ గా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నందుకు అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను. ఈ అసోసియేష‌న్ మ‌రింత‌గా అభివృద్ది చెందేందుకు.. అలాగే స‌భ్యులంద‌రికి సంక్షేమం అందించేందుకు.. సురేష్ కొండేటి గారి సార‌ధ్యంలో క‌మిటీ అంతా కృషి చేస్తుంద‌ని తెలియ‌చేస్తున్నాను అన్నారు.