అన్యా’స్ ట్యుటోరియల్’ ట్రైలర్ లాంచ్ చేసిన ఎస్.ఎస్.రాజమౌళి
* రెజీనా కసాండ్ర, నివేదితా సతీష్ ప్రధాన పాత్రధారులుగా ఆర్కా మీడియా, ఆహా నిర్మిస్తోన్న వెబ్ సిరీస్ * జూలై 1న విడుదల
దెయ్యాలు అసలు ఉన్నాయా? లేవా? అవి ఉంటే ఆ భయం ఎలా ఉంటుంది? అదే దెయ్యం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వస్తే? ఎప్పుడూ ఊహించని మలుపులతో ఆర్కా మీడియా, ఆహా సరికొత్త హారర్ వెబ్ సిరీస్ ‘అన్యా’స్ ట్యుటోరియల్’ వస్తుంది. ఎస్.ఎస్.రాజమౌళి ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ వెబ్ సిరీస్‌లో రెజీనా కసాండ్ర, నివేదితా సతీష్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. ఈ 7 ఎపిసోడ్‌ల వెబ్ సిరీస్‌ను జూలై 1 నుంచి ఆహా తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమ్ చేయనుంది.
భయానికి మరో రూపం ‘అన్యా’స్ ట్యుటోరియల్’. ఇప్పటి వరకు ఎప్పుడూ ఎక్కడా చూడని ఒక సరికొత్త వెబ్ సిరీస్‌తో ఆర్కా మీడియా మనందరి ముందుకు వస్తుంది. ఈ సిరీస్ ఆర్కా మీడియా, ఆహా కలయికలో రూపొందుతోంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే జూలై 1న తప్పక చూడండి.
ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజటల్ వైపు అడుగులు వేస్తోంది. కానీ అదే డిజిటల్ రంగం అందరినీ భయపెడితే .. అదే అన్యాస్ ట్యుటోరియల్. అన్య (నివేదితా సతీష్) ఒక సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్ కావాలని ప్రయత్నిస్తుంది. కానీ మధు (రెజీనా కసాండ్ర)కి తన చెల్లి అన్య ప్రొఫెషన్ నచ్చదు. కానీ అనుకోకుండా ఓ రోజు మొత్తం మారిపోతుంది. ఎవరూ చూడని విధంగా సైబర్ ప్రపచం మొత్తం భయపడుతుంది. అసలు ఎందుకు? అది తెలుసుకోవాలంటే అన్యాస్ ట్యుటోరియల్ చూడాల్సిందే. తన అభిమానుల కోసం ఆహా, ఈ వెబ్ సిరీస్‌ను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
ఆర్కా మీడియా శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ‘‘హారర్ చూపించాలంటే చాలా కష్టం. కానీ ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా పనిచేసి మనందరి ముందుకు తీసుకురాబోతున్నారు. ఆహా టీమ్‌తో ఇలాంటి కాన్సెప్ట్ కోసం జత కట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అన్యాస్ ట్యుటోరియల్ కథ వినగానే, ఇలాంటి ఓ స్టోరిని అందరికీ చెప్పాలని, అభిమాలు కూడా ఇష్టపడతారనే ఈ వెబ్ సిరీస్‌తో మీ ముందుకు వస్తున్నాం. ఇది అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం’’ అన్నారు.
నివేదితా సతీష్ మాట్లాడుతూ ‘‘నేను గుంటూరు అమ్మాయిని. ఎప్పుడు తెలుగు లోగిళ్లలో అడుగు పెడతానా అని ఆలోచించాను. ఆ కల ఈరోజు నిజమైంది. ఆర్కా మీడియా, ఆహా సంస్థలు కలయికలో వస్తున్న అన్యాస్ ట్యుటోరియల్ వెబ్ సిరీస్ ద్వారా లాంచ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ వెబ్ సిరీస్‌కు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాఉ. ఇన్నేళ్ల తర్వాత నా మాతృభాషలో అవకాశం వచ్చింది. అందరికీ అన్యాస్ ట్యుటోరియల్ నచ్చుతుందని, ఆదరిస్తారని భావిస్తున్నాను’’ అన్నారు.
భయపడటానికి సిద్ధమవ్వండి. ఎప్పుడూ చూడని విధంగా ఆర్కా, ఆహా .. అందరినీ భయపెట్టడానికి జూలై 1న వస్తున్నారు.