lots of love movie audio launch
లాట్స్ ఆఫ్ లవ్’ ఆడియో ఆవిష్కరణ
ప్రణవి పిక్చర్స్ పతాకంపై ఎస్ ఎమ్ వి ఐకాన్ ఫిలిమ్స్ సంస్థ నిర్మాణంలో అనిత మరియు ప్రఖ్యాత్ సమర్పిస్తున్న చిత్రం ‘లాట్స్ ఆఫ్ లవ్’ ఈ చిత్ర ఆడియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ గీతావిష్కరణ మహోత్సవానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లు రామకృష్ణ, దర్శకుడు వీరశంకర్, జెడి మోహన్ గౌడ్, ప్రసన్నకుమార్, ప్రతాని రామకృష్ణ గౌడ్, శ్రీరంగం సతీష్ లు హాజరయ్యి టిప్స్ తెలుగు మ్యూజిక్ ద్వారా ఒక్కొక్కరు ఒక్కో గీతాన్ని
విడుదల గావించగా, చిత్ర టీజర్ ను నటి అనిత షిండే మరియు ట్రైలర్ లను మిస్ ఊటీ అనన్య అగర్వాల్ విడుదల చేశారు. అనంతరం ముఖ్య అతిథి కొల్లు రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించి నటించి నిర్మించిన విశ్వ సాఫ్ట్ వేర్ రంగం నుంచి చిత్ర రంగానికి మంచి ఫ్యాషన్ తో వచ్చారు. ఈ లాట్స్ ఆఫ్ లవ్ మూవీని చేశారు. ట్రైలర్, సాంగ్స్, టీజర్ చాలా బాగున్నాయి. ఈ సినిమాతో అందరికీ మంచి పేరు రావాలని ఆశిస్తున్నా అన్నారు.
శ్రీరంగం సతీష్ మాట్లాడుతూ.. నాలుగు విభిన్నమైన జంటల మధ్య ఉండే ప్రేమ కథే ఈ లాట్స్ ఆఫ్ లవ్ సినిమా. మంచి మెసేజ్ కూడా ఇస్తున్నారు. మంచి కాన్సెప్ట్ కనుకే మేము ఈ సినిమాను బిసినెస్ చేయడానికి ముందుకు వచ్చాము అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ డా. బికె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గానే కాకుండా ఈ సినిమాలో నేను నటించడం కూడా జరిగింది. సాంగ్స్ బాగున్నాయి.. ఆర్టిస్టులందరూ ఎంతో సహకరించారు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వమే కాకుండా నిర్మించి నటించిన విశ్వ గారు సినిమాపై ఉన్న ఫ్యాషన్ మాత్రమే కాదు ఆయన ఎంతో మందికి సహాయసహకారాలు అందించారు. కోవిడ్ టైంలో 400 మందికి రోజూ అన్నం పెట్టేవారు. అలానే ఒకరికి చెవి ఆపరేషన్ కు 2లక్షల రూపాయలు ఇచ్చారు. అంతే కాకుండా సహాయం కోరిన వారందిరికీ ఉపాదికూడా కల్పించారు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి కూడా విశ్వ గారు.. కానీ ఎవరికీ చెప్పుకోరు అందుకే ఆయన మంచి తనం ఇప్పుడైనా ఈ సభా ముఖంగా తెలియచెప్పే అవసరం ఎంతైనా ఉందని తెలియచేస్తున్నాను అన్నారు.
దర్శక నిర్మాత అయిన విశ్వానంద్ మాట్లాడుతూ.. మనం పుట్టినప్పటి నుంచి మనచుట్టూ ఎంతో లవ్ ను చూస్తూ ఉంటాము. అలా విభిన్నమైన 4జంటల మధ్య ఉండే, జరిగే ప్రేమ
కథాంశంమే ఈ మా ‘లాట్స్ ఆఫ్ లవ్’. ఈ సినిమాలో 100 మంది ఆర్టిస్టులు ఉన్నారు అందరినీ మ్యానేజ్ చేయడం కష్టమైనా వారందరి సహకారం తో సినిమా పూర్తి చేయగలిగాము. ఈ మా చిత్రాన్ని కోవిడ్ టైంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన డాక్టర్స్ కు, నర్సులకు, వ్యాక్సిన్ కనుగొన్న సైంటిస్టులకు అంకితం ఇస్తున్నా.. ఇక సినిమా పాటల విషయానికి వస్తే నేనే మ్యూజిక్ కంపోజ్ చేసాను విన్న వారందరూ బాగున్నాయి అంటున్నారు..ఇందులో ఉన్న 5 పాటలు కూడా విభిన్నమైన లవ్ థీమ్స్ ను కలిగిఉంటాయి. అన్నీ కుదిరితే వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
ఈ చిత్ర సమర్పకులు అనిత, ప్రఖ్యాత్ లతో పాటు నిహాంత్, రాజేష్, భావన, గుండు శ్రీనివాస్, మాధవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ లాట్స్ ఆఫ్ లవ్ చితనికి కథ-స్క్రీన్ ప్లే- మాటలు- పాటలు- నిర్మాత- దర్శకత్వం
డా. విశ్వానంద్ పటార్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డా. బి కె. కిరణ్ కుమార్, ఎడిటర్: శ్రీనివాస్, నాగిరెడ్డి, డిఓపి: మురళి, నగేష్, కుమార్. పి ఆర్ ఓ: వీరబాబు