Seetharamapuram lo Oka Prema Janta Movie Teaser launch
సీతారామపురంలో ఒక ప్రేమ జంట టీజర్ లాంచ్
శ్రీ ధనలక్ష్మి మూవీస్ పతాకంపై ఎమ్.వినయ్ బాబు దర్శకత్వంలో బీసు చందర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం `సీతారామపురంలో ఒక ప్రేమ జంట`. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ప్రేమకథా చిత్రంతో రణధీర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. నందిని రెడ్డి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్భంగా మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…“పాటలు, టీజర్ చూశాక ఇదొక చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రమని అర్థమవుతోంది. అందరూ కొత్తవారు నటించిన ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకంటున్నా. ఇంతకు ముందు ఆ నలుగురే నిర్మాతలు, వాళ్లే హీరోలు, వాళ్లవే థియేటర్స్ అన్నట్టు ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. కొత్తవాళ్లు కూడా వస్తున్నారు. సక్సెస్ సాధిస్తున్నారు. ఇంకా ఆ పరిస్థితి మారాలి. ఇక సింగిల్ విండో విధానం ద్వారా తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకోవడానికి తక్కువ రేట్లతో పర్మిషన్స్ ఇస్తున్నాం. తెలంగాణలో ఎన్నో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మంచి కల్చర్ ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల చిత్రాలు కూడా ఇక్కడ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకి అన్నివిధాలసహకరిస్తోంది.చిత్
దర్శకుడు వినయ్ బాబు మాట్లాడుతూ….“కథ అందరికీ నచ్చేలా ఉంటుంది. ప్రతి పాత్ర ప్రేక్షకుడికి కనెక్టయ్యేలా ఉంటుంది. డిఫరెంట్ వేలో ఆలోచించి తీసిన లవ్ స్టోరి ఇది. ప్రేమించడం కాదు…ఆ ప్రేమను నిలబెట్టుకోవాలన్న అంశాన్ని మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం. ఎక్కడా వల్గారిటీకి తావుండదు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది. క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా మా నిర్మాత సహకరించారు. హీరో హీరోయిన్స్ కొత్తవారైనా ఎంతో అనుభవం ఉన్నవారిలా నటించారు. మిగతా టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్ ఎంతో సహకరించారు. త్వరలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తాం“ అన్నారు.
నిర్మాత బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ…“ దర్శకుడు వినయ్ బాబు చెప్పిన కథ నచ్చి మా అబ్బాయి రణధీర్ ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మించాను. ఎక్కడా రాజీ పడకుండా కథకు తగ్గట్టుగా ఖర్చు పెట్టాం. గ్రామీణ వాతావరణంలో జరిగే చక్కటి ప్రేమకథా చిత్రమిది. కథలో మంచి మలుపులు ఉన్నాయి. కథా పరంగా చాలా పెద్ద సినిమా ఇది. విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా అవుట్ పుట్ బాగొచ్చింది. దర్శకుడు చెప్పినదానికన్నా సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం“ అన్నారు.
హీరోయిన్ నందిని రెడ్డి మాట్లాడుతూ….“ ఒక మంచి టీమ్ తో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు“ అన్నారు.
హీరో రణధీర్ మాట్లాడుతూ….“ మా డీఓపీ గారు నన్ను ప్రతి ఫ్రేమ్ లో ఎంతో అందంగా చూపించారు. గణేష్ మాస్టర్ గారు పెద్ద సినిమాలు చేస్తూ కూడా మా సినిమాకు అద్బుతమైన కొరియోగ్రఫీ అందించారు. వినయ్ బాబు గారి సపోర్ట్ వల్లే ఈ సినిమాలో అనుకున్నట్టుగా నటించగలిగాను. సీనియర్ ఆర్టిస్ట్స్ సుమన్ ,సూర్య గార్లు ఇచ్చిన సలహాలు, సూచనలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. మ్యూజిక్ కూడా సినిమాకు మంచి ప్లస్ అవుతుంది. మా పేరెంట్స్ సహకారం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. హీరోగా నా తొలి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్, మహేందర్ రెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కాదంబరి కిరణ్ చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
సుమన్, సూర్య, అమిత్, నిట్టల్, మిర్చి మాధవి, శివ శంకర్, బిహెచ్ ఇ ఎల్ ప్రసాద్, భాష తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతంః ఎస్.ఎస్ నివాస్; కెమెరాః విజయ్ కుమార్.ఎ, ఎడిటింగ్ః నందమూరి హరి; ఫైట్స్ః రామ్ సుంకర; కొరియోగ్రఫీః గణేష్ మాస్టర్, అజయ్ శివ శంకర్; పాటలుః సుద్దాల అశోక్ తేజ, అభినయ శ్రీనివాస్; పి ఆర్ ఓ: చందు రమేష్(బాక్సాఫీస్) నిర్మాతః బీసు చందర్ గౌడ్; కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వంః ఎమ్.వినయ్ బాబు.