తెలుగు

క‌ర‌ణ్ అర్జున్ మూవీ రివ్యూ!

By admin

June 24, 2022

క‌ర‌ణ్ అర్జున్ మూవీ రివ్యూ!

నటీనటులు

అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా, మాస్ట‌ర్ సునీత్, అనితా చౌదరి, రఘు.జి, జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్.. సాంకేతిక నిపుణులు: నిర్మాతలు: డా. సోమేశ్వ‌ర‌రావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవి మేకల కథ -మాటలు -స్క్రీన్ ప్లే- ద‌ర్శ‌క‌త్వం: మోహన్ శ్రీవత్స ఫైట్స్: రామ్ సుంకర ఎడిటర్: కిషోర్ బాబు మ్యూజిక్: రోషన్ సాలూర్ పాట‌లుః సురేష్ గంగుల‌ కొరియోగ్రఫీ: రవి మేకల డి .ఓ .పి: మురళి కృష్ణ వర్మన్; రేటింగ్ః 3.25/5 విడుద‌ల తేదిః 24-6-22

ఫ‌స్ట్ లుక్ ద‌గ్గ‌ర నుంచి పాట‌లు, టీజ‌ర్, ట్రైల‌ర్ తో ఆక‌ట్టుకున్న చిత్రం `క‌ర‌ణ్ అర్జున్‌`.  విడుద‌ల‌కు ముందే హైప్ ని పెంచుకుంది. మ‌రి ఈ నెల 24న విడుద‌లైన ఈ చిత్రం ఆ అంచ‌నాల‌ను అందుకుందా లేదా అని రివ్యూ ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం….

క‌థ‌లోకి వెళితే… త‌న‌కి కాబోయే వైప్‌తో ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూటింగ్ కోసం  క‌ర‌ణ్‌, ఫృషాలిని తీసుకొని పాకిస్తాన్ బార్డ‌ర్ లో ఉన్న జై స‌ల్మేర్ కి వెళ‌తాడు. ఈ జ‌ర్నీలో బుల్లెట్ పై ప్రెడెట‌ర్ హెల్మెట్ ధ‌రించిన‌ ఒక ఆగంత‌కుడు ఈ జంట‌ను వెంటాడి వేటాడి ప‌ట్టుకుని ఇద్ద‌ర్నీ బంధిస్తాడు. హీరోని ఒక గుంతలో పెట్టి ఇబ్బంది పెడుతుంటాడు.  ఈ క్ర‌మంలో వీళ్ల‌ను జై స‌ల్మేర్ కి చెందిన ఒక లారీ డ్రైవ‌ర్ హీరోయిన్ ఎత్తుకుపోతాడు. ఆ అమ్మాయిని ఆ ఆగంత‌కుడు కాపాడ‌తాడు.  చంపాలి అనుకున్న హీరోయిన్ ని  ఎందుకు కాపాడాడు?  క‌ర‌ణ్‌ని ఎందుకు చిత్ర హింస‌లు పెడతాడు? అస‌లు క‌ర‌ణ్ అర్జున్ ల క‌థేంటి తెలియాలంటే థియేట‌ర్ కి వెళ్లాల్సిందే. న‌టీన‌టుల హావ‌భావాలుః క‌ర‌ణ్ గా న‌టించిన నిఖిల్ కుమార్ ఫ‌స్టాఫ్ లో త‌నకు కాబోయే భార్య‌ని ఇంప్రెస్ చేయాల‌న్న పాత్ర‌లో మెప్పించాడు. ఇక సెకండాఫ్ లో త‌న క్యార‌క్ట‌ర్ డిఫ‌రెంట్ షేడ్ లోకి వెళుతుంది. ఇక క్లైమాక్స్ లో త‌న అస‌లు రంగు బ‌య‌ట‌పెట్టే పాత్ర‌లో జీవించాడు.  అర్జున్ గా న‌టించిన అభిమ‌న్యు అద్భుతంగా న‌టించాడు. ల‌వ‌ర్ బాయ్ గా, సామాజిక బాధ్య‌త ఉన్న  కుర్రాడుగా, రివేంజ్ తీర్చుకునే ప్రేమికుడుగా ఒదిగిపోయాడు. ఇద్ద‌రూ పోటాపోటీగా న‌టించారు. ఇక అనిత చౌద‌రి ఎప్ప‌టిలాగే త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. హీరోయిన్ రెండు పాత్ర‌ల్లో అందంతో పాటు అభిన‌యంతో ఆక‌ట్టుకుంది.

సాంకేతిక నిపుణుల ప‌నితీరుః ముందుగా డైర‌క్ట‌ర్ రాసుకున్న క‌థ క‌థ‌నాల గురించి చెప్పాలి. తెలుగులో రోడ్ థ్రిల్ల‌ర్స్ చాలా త‌క్కువ‌. మొద‌టి సారి ద‌ర్శ‌కుడు ఆ ప్ర‌య‌త్నంచేసి స‌ఫ‌లీకృత‌మ‌య్యాడ‌నే చెప్పాలి. మూడు క్యారక్ట‌ర్ల‌లో సినిమా అంతా ర‌న్ చేయ‌డ‌మంటే క‌ట్టిప‌డేసే  క‌థ‌నంతో పాటు ఆర్టిస్టులు అద్భుత‌మైన న‌ట‌న ప్ర‌ద‌ర్శించాలి. అప్పుడే స‌న్నివేశాలు ర‌క్తి క‌డతాయి. అలా క‌ట్టిప‌డేసే క‌థ‌నంతో, కొత్త‌వారి నుంచి అద్భుత‌మైన న‌ట‌న రాబ‌ట్టుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. ఎక్క‌డా బోర్ లేకుండా సినిమా అప్పుడే అయిపోయిందా అనే ఫీల్ క‌లుగుతుంది. క‌ర‌ణ్, అర్జున్ రెండు పాత్ర‌లు కూడా ద‌ర్శ‌కుడు చాలా బాగా డిజైన్ చేశాడు. డైలాగ్స్ కూడా యూత్ ని ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్వాలేదు. రోష‌న్ సాలూరి నేప‌థ్య సంగీతం బాగుంది.. కానీ కొన్ని చోట్ల ఆ స‌న్నివేశానికి మించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వ‌డంతో అక్క‌డ‌క్క‌డా ఆడియ‌న్స్ ఇబ్బంది ఫీల‌వుతారు. క‌శ్మీర్ లో చేసిన పాట విన‌డానికి,  చూడ‌టానికి కొరియోగ్ర‌ఫీ బాగుంది. ఎడిటింగ్ చాలా క్రిస్పీ గా ఉంది. క్రౌడ్ ఫండింగ్ సినిమా అయినా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా క‌థ పెట్టాల్సినంత పెట్టారు. విశ్లేష‌ణ‌లోకి వెళితే… మొదట్లో సినిమా టేక్ ఆఫ్ కావడానికి కొంత సమయం తీసుకున్నా… ఇంటర్వల్ బ్యాంగ్ నుంచి క్లైమాక్స్ దాకా ట్విస్టులతో సినిమా ఇంట్ర‌స్టింగ్ గా కొన‌సాగుతుంది.   రాజస్థాన్ లోకేషన్స్,  ఎడారిలో చేజింగ్ సీక్వెన్స్  సినిమాకు హైలెట్‌.  ఇంట్ర‌స్టింగ్ కాన్సెప్ట్ తో హాలీవుడ్ త‌ర‌హాలో రూపొందిన రోడ్ థ్రిల్ల‌ర్ `క‌ర‌ణ్ అర్జున్‌` . డిఫ‌రెంట్ సినిమాలు కోరుకునే వారికి క‌చ్చితంగా నచ్చుతుంది.

రేటింగ్: 3.25/5