News

Director Maruthi Interview

By admin

June 27, 2022

 

టైటిల్ కు జస్టిఫై చేసే సినిమా “పక్కా కమర్షియల్”…స్టార్ డైరెక్టర్ మారుతి

భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందిస్తూ వరస విజయాలతో జోరు మీదున్న విలక్షణ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమా “పక్కా కమర్షియల్”. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్‌తో చేస్తున్న “పక్కా కమర్షియల్” సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా రాసారు. అలాగే రాశీ ఖన్నా పాత్రను హిలేరియస్‌గా డిజైన్ చేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన  ప్రీ రిలీజ్ వేడుక శిల్ప కళావేదికలో ఎంతో గ్రాండ్ గా జరిగింది.ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిలుగా హాజరయ్యి  చిత్ర యూనిట్ ను బ్లెస్స్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని జులై 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు మారుతి పాత్రికేయ మిత్రులతో  మాట్లాడుతూ..

నిన్న ప్రి రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి గారు లాంటి గొప్ప వ్యక్తి నాతో సినిమా చేస్తాను అని చెప్పడం నాకు పెర్సనల్ గా గొప్ప ఎనర్జీ నిచ్చినట్టు అనిపించడమే గాక నా లాంటి డైరెక్టర్ కు గొప్ప  ఎంకరేజ్మెంట్. అలాగే తరువాత దర్శకులకు ఆయన వ్యాఖ్యలు ఒక ఇన్స్పిరేషన్.

చిరంజీవి గారిని ఎలా చూయించాలో ఒక డైరెక్టర్ గా కాకుండా ఒక ఆడియన్ గా అలోచించి చూపిస్తాను.అయన ఏదిచ్చినా చేస్తారు. కానీ నా స్ట్రెంత్ ఏంటి ఆయనను ఎలా చూపిస్తే బాగుంటుంది అనేది నాకు ఒక వ్యూ ఉంటుంది.

పక్కా కమర్షియల్ సినిమాతో గోపీచంద్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా హీరో గోపీచంద్ చాలా స్టైలిష్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నారు.ఈ సినిమా తనకు మంచి పేరు తెస్తుందని ఆయన కూడా బాగా నమ్మారు. పక్కా కమర్షియల్ అని ఈ సినిమాకు పేరు పెట్టినప్పుడే ఇందులో కావాల్సిన క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకునే అవకాశం దొరికింది.

ఒక వ్యక్తి డైరెక్టర్ అవ్వాలి అంటే తనకు ట్యాలెంట్ కంటే ముందు తను ఒక ఆడియన్ అయ్యుంటే ద బెస్ట్ సినిమా తియ్యగలుగుతాడు. నాకు ఈ కమర్సియల్ యాంగిల్ లో బడ్జెట్ లో చేయడం ఎందుకు వచ్చిందంటే నేను డిస్ట్రిబ్యూషన్ చేయడం. ఆడియన్స్ ఏ సినిమాలు చూస్తున్నారు దేనికి లేచి వెళ్లిపోతున్నారు అనేది తెలుసు కోగలగాలి . ఇప్పుడు మనం ఏమి ఆ నుకుంటున్నామంటే నేను చాలా గొప్ప సినిమా తీశాను అనుకుంటాడు. కానీ ఆడియన్స్ కు నచ్చదు. వారెందుకు రిజెక్ట్  చేశాడో తెలియదు అలాంటప్పుడు ఆడియన్ కు మనకు సింక్ పోతుంది.మనము ఏ జోనర్ సినిమా తీసినా ఆడియన్ ఎం కోరుకుంటాడు వారికీ ఎం కావాలో ఇస్తూ సినిమా సినిమాకు  మనం ఎలా ఎదుగుతున్నాం అని చెక్ చేసుకుంటూ కంపారిజన్ చేసుకోవాలి. ఎందుకంటే సినిమా అనేది ఫైనాన్సియల్ యాక్సెప్ట్ తో కూడుకొని ఉంటుంది. ఇందులో క్రొర్స్  బిజినెస్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఆడియన్ కు ఎం కావాలో ఇచ్చి వారి దగ్గర డబ్బులు తీసుకొని  ప్రొడ్యూసర్ కు ఇవ్వాల్సిన మీడియేషన్ బాధ్యత ఒక డైరెక్టర్ దే.. ఈ మీడియేషన్ కరెక్ట్ గా చెయ్యకపోతే ఇటు నిర్మాతలు పోతారు, అటు ఆడియన్స్  పోతారు. అందుకని డైరెక్టర్ మీడియేషన్ జాబ్ ను ప్రాపర్ గా హ్యాండిల్ చెయ్యాలి అంటాను.లేకపోతె నేను మంచి సినిమా తీశాను ఆడియన్ కు చూడడానికి రాలేదని ఇలా రకరకాల కారణాలు చెపుతూ బ్లేమ్ వేరే వాళ్లమీద తోసేసి తను సేఫ్ జోన్ ఆడుతుంటాడు

ప్రతి ఒక్కరూ స్క్రిప్ట్ ను బాగా రాసుకోవాలి.అవసరం అయితే  నెల, రెన్నళ్ళు ఎక్కువ కష్టపడి స్క్రిప్ట్స్  ను మన టేబుల్ మీదే ఎడిట్ చేసుకోగలిగితే చాలా వేస్టేజ్ పోయి నిర్మాతకు చాలా  డబ్బులు మిగులుతాయి..దీనికి తోడు మంచి మంచి సబ్జెక్టులు వస్తాయి. ఇప్పుడున్న ఇండస్ట్రీ క్రైసస్ లో బడ్జెట్ , రోజులు తగ్గిస్తూ మంచి మంచి కథలను  సెలెక్ట్ చేసుకుని ఆడియన్స్ కు నచ్చేవిదంగా మంచి సబ్జెక్ట్స్ తియ్యాలి.అంతేకాని మనకు ఇష్టమొచ్చినట్లుగా సినిమా తీస్తే ఆడియన్స్ చూడరు.మరోవైపు నిర్మాతను, థియేటర్ వ్యవస్థను కాపాడుకోకపోతే చాలా ప్రమాదం. కాబట్టి ప్రస్తుతం డైరెక్టర్ ఎంత రెస్పాన్సబుల్ గా ఉన్నాడంటే నిర్మాతను ఒప్పించాలి, థియేటర్ ను కాపాడుకోవాలి, ఆడియన్స్ ను సినిమాకు రప్పించాలి. ఒక వేల ఓటిటి కు పొతే అక్కడ ఆడియన్స్ కన్నును పక్కకు తిప్పుకోకుండా చూయించగలగాలి ,అప్పుడే ఒక డైరెక్టర్ సక్సెస్ అయ్యినట్టు.

ఈ బ్యాన‌ర్స్ నుంచే భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ సినిమాలు నాకు చాలా మంచి పేరును తీసుకు వచ్చాయి. దానికి కారణం మంచి కథ, నటీ నటులు, టెక్నిషియన్స్ సెట్ అవ్వడం.మనకు చాలా మంది మంచి ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లకు తగిన క్యారెక్టర్స్ రాస్తే మిగతా భాషల నటీనటులను తెచ్చుకోవాల్సిన పని ఉండదు. ఈ సినిమాలో సత్యరాజ్, రావు రమేష్ లాంటి ఆర్టిస్టులు తీసుకోవడానికి కారణం వాళ్లు చేయాల్సిన మంచి పాత్రలు కథలో ఉన్నాయి.

దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సంగీత దర్శకుడు జ‌కేస్ బీజాయ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు

సినిమా రేట్లు ఎక్కువగా ఉండడం వలన ప్రేక్షకులు పెద్ద సినిమాలకు ఎక్కువగా థియేటర్స్ కు రావడంలేదు.అందుకే మేము తక్కువ రేట్ కే మా సినిమా టికెట్స్ ఉంటాయని ప్రచారం చేస్తున్నాము. అయితే మా సినిమాను చాలామంది ఓటిటి లో చూద్దాం అనుకున్నారేమో కానీ ఇప్పట్లో ఈ సినిమా ఓటిటి లో రాదు.

మంచి కథతో తెరకెక్కించిన “పక్కా కమర్షియల్” సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.మీరు హ్యాపీగా కాలర్ ఎగరేసుకునే చూసే సినిమా ఇది, ఒక మంచి ఎంటర్టైనర్ గా  తీసిన ఈ సినిమా చూసిన వారందరినీ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చిన యూవీ క్రియేషన్స్ కి ,గీతా ఆర్ట్స్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకి, టెక్నీషియన్స్ అందరికి చాలా థాంక్స్

యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో చిరంజీవి గారితో సినిమా అనుకున్నాం. ఆయనకు ఒక లైన్ చెప్పాను నచ్చింది. మెగాస్టార్ డేట్స్ ను బట్టి ఆ సినిమా చేస్తాను. ప్రభాస్ సినిమా కూడా ఆయన స్థాయికి తగినట్లే గ్రాండ్ గా చేయబోతున్నాను అని ముగించారు