News

Bimbisara Movie trailer Launch

By admin

July 05, 2022

 

నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్.. ‘బింబిసార’ ట్రైలర్ విడుదల.. టెరిఫిక్ రెస్పాన్స్‌

కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఈ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ పుట్టిన రోజు (జూలై 5) సంద‌ర్భంగా సోమ‌వారం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో …

హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘ రెండున్నరేళ్ల తర్వాత అందరినీ కలుస్తున్నాను. ఎన్నో చంద‌మామ క‌థ‌లు విన్నాం. చ‌దివాం.. కొన్ని చూశాం. కొన్ని తాత‌య్య‌, నాన్న‌మ్మ‌, అమ్మ‌మ్మ‌లు కొన్ని క‌థ‌ల‌ను చెబితే, కొన్నింటిని మ‌నం పుస్త‌కాల్లో చ‌దివాం. కొన్నింటిని మ‌నం వెండితెర‌పై చూసుంటాం. తాత‌గారు చేసిన పాతాళ భైర‌వి, గులేబ‌కావళి క‌థ‌, జ‌గ‌దేవీరుని క‌థ‌, బాబాయ్ చేసిన భైర‌వ ద్వీపం, త‌ర్వాత వ‌చ్చిన ఆదిత్య 369.. త‌ర్వాత చిరంజీవిగారు చేసిన జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి, మా జ‌న‌రేష‌న్‌లో త‌మ్ముడు చేసిన య‌మ‌దొంగ‌, రామ్ చ‌ర‌ణ్ చేసిన మ‌గ‌ధీర‌, రీసెంట్‌గా వ‌చ్చిన ప్ర‌భాస్ బాహుబ‌లి సినిమాలు గ‌మ‌నిస్తే.. అన్ని అంద‌మైన సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. అలాంటి అంద‌మైన గొప్ప చంద‌మామ క‌థ‌ను ఆగ‌స్ట్ 5న మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదే బింబిసార‌. ఆ సినిమాల‌ను ఆద‌రించిన‌ట్లే ఈ సినిమాను ఆద‌రిస్తార‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆశిస్తున్నాను. టీజ‌ర్‌, ట్రైల‌ర్ మీకు న‌చ్చే ఉంటాయ‌ని అనుకుంటున్నాను. మా సినిమా కోసం ప‌నిచేసిన తోటి న‌టీన‌టుల‌కు చాలా థాంక్స్‌. అంద‌రూ ఈ సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డారో మ‌ళ్లీ మ‌రోసారి మాట్లాడుతాను. ఈ ఏడాది మా తాత‌గారు స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌గారి వంద‌వ పుట్టిన రోజు సంవ‌త్స‌రంగా వ‌న్ అండ్ ఓన్లీ లెజెండ్ అయిన ఆయ‌కు మా బింబిసార సినిమాను డేడికేట్ చేస్తున్నాను’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ్ మాట్లాడుతూ ‘‘కొత్త దర్శకుడు చెప్పిన కథ విని నమ్మి సపోర్ట్ చేసిన నిర్మాత హరిగారికి, ప్రతి నిమిషం నువ్వు చేయగలవు అని చెబుతూ ఎంకరేజ్ చేస్తూ వచ్చిన నా బింబిసారుడు కళ్యాణ్ రామ్ గారికి థాంక్స్‌. ఆగ‌స్ట్ 5న మా బింబిసారుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో థియేటర్స్‌లో చూస్తారు’’ అన్నారు.

సంయుక్తా మీన‌న్ మాట్లాడుతూ ‘‘సినిమాకు ఇంత మంచి ల‌వ్‌, స‌పోర్ట్ మ‌రెక్క‌డా నేను చూడ‌లేదు. కేవ‌లం తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోనే క‌నిపిస్తోంది. తెలుగులో నేను యాక్ట్ చేసిన సినిమా ఇది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌. సినిమాను, సినిమాలో యాక్ట్ చేసే వారిని తెలుగు ప్రేక్ష‌కులు ఎంతగానో స‌పోర్ట్ చేస్తారు. మీ ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు’’ అన్నారు.

క్యాథరిన్ ట్రెసా మాట్లాడుతూ ‘‘కోవిడ్ త‌ర్వాత నేను న‌టించిన తొలి చిత్రం బింబిసార‌. ఈ సినిమాలో న‌టించ‌డానికి అవ‌కాశం ఇచ్చిన ఎన్టీఆర్ ఆర్ట్స్‌కి, ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌కు థాంక్స్‌. ఇందులో ఐరా అనే పాత్ర‌లో న‌టించాను. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత నేను న‌టించిన పీరియాడిక్ పాత్ర ఇది. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. ట్రైల‌ర్‌ను అంద‌రూ ఎంజాయ్ చేసుంటారు. క‌ళ్యాణ్ రామ్ నుంచి చాలా నేర్చుకున్నాను. మంచి న‌టుడు. ఆయ‌న స‌పోర్ట్‌కి థాంక్స్‌. ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ తొలి చిత్ర‌మే అయినా అద్భుత‌మైన విజ‌న్ ఉన్న వ్య‌క్తి. అద్భుతంగా సినిమాను తెర‌కెక్కించాడు. అన్ని వ‌య‌సుల వారు సినిమాను చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు’’ అన్నారు.

ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్‌. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి పాట‌లు:  సిరి వెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి, డాన్స్‌:  శోభి, ర‌ఘు, ఫైట్స్‌:  వెంక‌ట్‌, రామ‌కృష్ణ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:  అనిల్ ప‌డూరి, ఆర్ట్‌:  కిర‌ణ్ కుమార్ మ‌న్నె, ఎడిట‌ర్‌:  త‌మ్మిరాజు, మ్యూజిక్‌:  చిరంత‌న్ భ‌ట్‌, నేప‌థ్య సంగీతం:  ఎం.ఎం.కీర‌వాణి, సినిమాటోగ్ర‌ఫీ:  ఛోటా కె.నాయుడు, ప్రొడ్యూస‌ర్‌: హ‌రికృష్ణ.కె, ద‌ర్శ‌క‌త్వం: వ‌శిష్ఠ్‌.