News

తమిళ్ లో ‘ఇరవిన్‌ నిళల్‌’ లో నటించిన ‘బ్రిగిడ సాగా’ (పవి) తెలుగులో ‘సిందూరం’ లో నటిస్తోంది.

By admin

July 19, 2022

 

తమిళ్ లో ‘ఇరవిన్‌ నిళల్‌’ లో నటించిన ‘బ్రిగిడ సాగా’ (పవి) తెలుగులో ‘సిందూరం’ లో నటిస్తోంది.

 

‘ఇరవిన్ నిళల్’ అనే సినిమా జూలై 15న తమిళనాడులో విడుదలైన మంచి విజయం సాధించింది. వరలక్ష్మి శరత్ కుమార్, రోబో శంకర్, ప్రియాంకా రుత్, ఆనంద కృష్ణన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీలో బ్రిగిడ సాగా (పవి) ఒక ముఖ్య పాత్రలో నటించి మెప్పించింది. ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ సినిమా సింగిల్ షాట్‌లో చిత్రీకరించారు. అంతేకాదు, మొట్టమొదటి నాన్ లీయర్ సింగిల్ షాట్ ఫిల్మ్‌గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ఇందులో చిలకమ్మ అనే పాత్ర పోషించిన బ్రిగిడ సాగా (పవి) అనే అమ్మాయి.. నగ్నంగా నటించారు. కాగా ఇందులోని తన పాత్ర గురించి బ్రిగిడ ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్న తనను ఒక హీరోయిన్‌ను చేసిన క్రెడిట్‌ పార్తీబన్‌కే దక్కుతుందన్నారు. ఆయన కోరిక మేరకే తాను ‘ఇరవిన్‌ నిళల్‌’ మూవీలో నగ్నంగా నటించానని చెప్పారు. ‘ఈ చిత్రంలో సహాయ దర్శకురాలిగా పని చేసేందుకు వెళ్ళిన తనను హీరోయిన్‌గా సెలెక్ట్‌ చేశారని, సినిమాకు ఒక న్యూడ్‌ సీన్‌ అవసరమవుతుందని, అందుకు సినిమాను ప్రేమించే వారే కావాలని వారు చెప్పడంతో ఒప్పుకున్నానని చెప్పారు. ఈ పాత్ర చేయడానికి తన తల్లిదండ్రులను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డానని, ఆ తర్వాత పార్తీబన్‌ అంతా వివరించడంతో వారు ఒకే చెప్పారన్నారు. అయితే, ఈ సన్నివేశంలో అనేక టెక్నికల్‌ విషయాలున్నాయని, సినిమాలో చూస్తే మాత్రం అది నిజంగానే న్యూడ్‌ సీన్‌గా కనిపిస్తుంది’ అని వివరించారు. కాగా న్యూడ్‌ సీన్‌ను బ్రిగిడ ధైర్యంగా చేసిందంటూ అందరూ మెచ్చుకుంటూ అభినందిస్తున్నారు.

ప్రస్తుతం బ్రిగిడ సాగా (పవి) సిందూరం అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. శ్రీ‌ల‌క్ష్మీ న‌ర‌సింహ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ధ‌ర్మ‌, బ్రిగిడ సాగ (పవి) హీరో హీరోయిన్లుగా, శివ బాలాజీ ప్రధాన పాత్రలో ప్రొడ‌క్ష‌న్ నెం.1గా నూత‌న చిత్రం ‘సిందూరం’. ఈ సినిమాకు ప్ర‌వీణ్ రెడ్డి జంగ నిర్మాత. లవ్ అండ్ పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో ఆలోచింప‌జేసే క‌థ‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ చిత్రాల‌కు సినిమాటొగ్రాఫ‌ర్‌గా ప‌నిచేసిన శ్యామ్ తుమ్మ‌ల‌పల్లి ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం కాబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన సిందూరం టైటిల్ పోస్టర్ మంచి స్పందన లభించింది.