తెలుగు

*ద‌ర్శ‌కుడు స‌ముద్ర చేతుల మీదుగా హీరో విజ‌య‌కృష్ణ “గోవింద భ‌జ గోవింద” సినిమా గ్లింప్స్ రిలీజ్*

By admin

July 27, 2022

*ద‌ర్శ‌కుడు స‌ముద్ర చేతుల మీదుగా హీరో విజ‌య‌కృష్ణ “గోవింద భ‌జ గోవింద” సినిమా గ్లింప్స్ రిలీజ్*

డాలీ నిహారిక ప్రెజెంట్స్ విజ‌య‌శ్రీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న చిత్రం ‘గోవింద భ‌జ గోవింద‌”. ఈ చిత్రానికి ప్రొడ్యూస‌ర్, డైరెక్ట‌ర్ గా సూర్య‌ కార్తికేయ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌థ‌ని కూడా ఆయ‌నే అందించారు. దుర్మార్గుడు ఫేమ్ విజ‌య‌కృష్ణ‌ హీరోగా, హీరోయిన్ ప్రియా శ్రీనివాస్ న‌టిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్ ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిధులుగా గ‌ణా మూవీ డైరెక్ట‌ర్ రాజ్ తాళ్లూరి..ప్ర‌ముఖ ఎడిట‌ర్ నంద‌మూరి హ‌రి, నిర్మాత ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా

*ద‌ర్శ‌కుడు సూర్య మాట్లాడుతూ*….ఇది నా మొద‌టి సినిమా. ఆద్యంతం హాస్య‌భ‌రితంగా ఉంటుది. ప్రేక్ష‌కులు కడుపుబ్బా న‌వ్వుతార‌ని హామీ ఇస్తున‌్నాము. అన్నారు.

*హీరో విజ‌య‌కృష్ణ మాట్లాడుతూ*….గోవింద భ‌జ గోవింద చిత్రం నాకు రెండ‌వ చిత్ర‌ం. నేను హీరోగా న‌టించిన మొద‌టి చిత్రం “దుర్మార్గుడు” ఫుల్ యాక్ష‌న్ మూవీగా ఆకట్టుకుంది. రెండో చిత్రం ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నా. మా సొంత బ్యానర్ లో గ‌ణా మూవీ షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాము. అన్నారు.

“గోవింద భ‌జ గోవింద” చిత్రానికి డీఓపీ కొల్లి మ‌నోహ‌ర్..మ్యూజిక్ ని ఆర్.జె.చ‌క్ర‌వ‌ర్తి అందించారు. కో డైరెక్ట‌ర్ శివ‌. ఈ చిత్రం త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతోంది.