ఆగస్ట్ 12న ఓటీటీ లో వస్తోన్న లెస్బియన్ చిత్రం `హోలీ వుండ్`
సహస్ర సినిమాస్ ప్రై. లి సమర్పణలో జానకి సుందర్, అమృతా వినోద్, సాబు ప్రౌదిక్ ప్రధాన పాత్రల్లో సందీప్ ఆర్ మలయాళంలో నిర్మించిన చిత్రం `హోలీవుండ్`. అశోక్ ఆరాన్ దర్శకుడు. లెస్బియన్ నేపథ్యంలో రూపొందిన ఈ సైలెన్స్ సినిమా ఎన్నో కాంట్రవర్సీల మధ్య ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా గ్రాండ్ గా రిలీజవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సందీప్ ఆర్ మాట్లాడుతూ…“చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఇద్దరు అమ్మాయిలు.. కొంత కాలంగా కలిసి ఉండటంతో వారిద్దరి మధ్య సెక్స్ ఫీలింగ్స్ కలుగుతాయి. సృష్టికి విరుద్దంగా వారు లైంగిక సంతృప్తి చెందుతుంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్నది సినిమా. డీప్ ప్రేమలో ఉన్న ఇద్దరు ఆడవాళ్లు, ఇద్దరు మగవాళ్లు శృంగారంలో పాల్గొనడం తప్పు కాదు అనే అంశాన్ని మా సినిమాలో చూపిస్తున్నాం. మా సినిమా ఎన్నో వివాదాల్లో చిక్కుకొని ..వాటన్నింటినీ దాటుకొని ఈ నెల 12న ఎస్ ఎస్ ఫ్రేమ్స్ ఓటీటీ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. మాటలు లేని ఈ సైలెన్స్ లెస్బియన్ సినిమా మీ అందర్నీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం“ అన్నారు.
ఈ చిత్రానికి డీఓపిః ఉన్ని మాధవూర్; సంగీతంః రోన్ రాఫిల్ ; స్క్రీన్ ప్లేః పాల్ విక్లిఫ్; ఎడిటింగ్ః విపిన్ మానూర్; దర్శకుడుః అశోక్ ఆరాన్, నిర్మాతః సందీప్ ఆర్.