` సామాన్యుడి ధైర్యం` మూవీ ప్రారంభం!
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1 గా సిహెచ్ నరేష్ హీరోగా రామ్ బొత్స దర్శకత్వంలో రమణ కొఠారు ఓ కీలక పాత్రలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `సామాన్యుడి ధైర్యం`. ఈ చిత్ర ప్రారంభత్సోవం ఈ రోజు ఫిలించాంబర్ లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా, ప్రముఖ పాత్రికేయులు వినాయకరావు, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ స్క్రిప్ట్ అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకుడు వి.సాగర్, వడ్లపట్ల మోహన్ , లయన్ సాయి వెంకట్, భాస్కర్ సాగర్ చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ…“సామాన్యుడికి మించిన ధైర్యం ఎవరిలో ఉండదు. అలాంటి అద్భుతమైన టైటిల్ తో ఈ సినిమా రూపొందిస్తోన్న దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను. సామాన్యుడి పై వచ్చిన చిత్రాలన్నీ గొప్ప విజయాలు సాధించాయి. ఆ కోవలో ఈచిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఇటీవల సామాన్యుడి ఆగ్రహానికి సినిమా గురై ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నదో చూశాం. కరోనా తో 2021లో హాలీవుడ్ , బాలీవుడ్ సైతం కొలాప్స్ అయినా… మన టాలీవుడ్ మాత్రం సక్సెస్ బాటలో పయనించింది. కానీ ఇటీవల టికెట్ రేట్లు పెంచడంతో సామాన్యుడి ఆగ్రహానికి గురై సినిమాలన్నీ వెలవెలబోయిన పరిస్థితి. ఆ తర్వాత టికెట్ రేట్లు తగ్గించడంతో, కంటెంట్ కూడా బావుండటంతో బింబిసార, సీతారామం, కార్తికేయ-2 చిత్రాలు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నాయి. సినిమా రంగంలో ఇంకా కొన్ని మార్పులు, చేర్పులు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. సామాన్యుడిని ఇబ్బంది పెడితే ఎంత గొప్ప వారైనా మూల్యం చెల్లించాల్సిందే. అటువంటి మంచి టైటిల్ తో వస్తోన్న ఈ చిత్ర బృందానికి ఈ సినిమా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా“ అన్నారు.
నిర్మాత రమణ కొటారి మాట్లాడుతూ…“దర్శకుడు చెప్పిన కథ నచ్చి తొలి సారిగా సినిమా రంగంలోకి వస్తూ సామాన్యుడి దైర్యం చిత్రం నిర్మిస్తునాను. దర్శకుడు చెప్పిన స్టోరీ నచ్చి వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. దర్శకుడు రామ్ బొత్స మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ఇలాంటి నూతన దర్శకులను ఎంకరేజ్ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మా `సామాన్యుడి దైర్యం` తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. అలాగే పిలవగానే మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన సినీ పెద్దలందరికీ కృతజ్ఞతలు “ అన్నారు.
దర్శకుడు రామ్ బొత్స మాట్లాడుతూ…“మా నిర్మాతకు కథ నచ్చడంతో ఈ సినిమా ప్రారంభించాం. సామాన్యుడి ధైర్యం ఎలా ఉంటుందో మా సినిమాలో చూపించబోతున్నాం. కొత్త, పాత నటీనటులతో ఈ సినిమా ఉంటుంది. ఇందులో యాక్షన్, హాస్యం, సామాజిక అంశాలుంటాయి“ అన్నారు.
ప్రముఖ దర్శకుడు వి.సాగర్ మాట్లాడుతూ..సామాన్యుడి ధైర్యం అనే టైటిల్ పెట్టి ఈ దర్శక నిర్మాతలు సగం సక్సెస్ అయ్యారు“ అన్నారు.
మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ…“ ఒక పవర్ ఫుల్ టైటిల్ తో వస్తోన్న ఈ చిత్రం ప్రజాదరణ పొందాలన్నారు.
లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ…“ టైటిల్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతోంది“ అన్నారు. భాస్కర్ సాగర్ మాట్లాడుతూ…“ నిజంగా సామాన్యుడి ధైర్యం అనే టైటిల్ తో సినిమా తీయాలంటే ధైర్యం ఉండాలన్నారు. రమణ కొఠారు, సిహెచ్ నరేష్, బి.రామ్, కె. హారిక ( ఛైల్డ్ ఆర్టిస్ట్), పీవీ చంద్రశేఖర్, ఆమదాల లక్ష్మీదేవి; పుష్పఫేమ్ ఆకళ్ల లక్ష్మణ్, ఎఫ్ ఎమ్ బాబాయ్; అంబటి నారాయణరావు, పరిగే రామరాజు, మధునూరి శివరామరాజు , లక్కోజు అప్పారావు , వేగ్నేష సత్యనారాయణ, కోకా ధనలక్ష్మి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డీఓపీః భాస్కర్ దోర్నాల; ఫైట్ మాస్టర్ః బాబ్జీ; మ్యూజిక్ డైరక్టర్ః సాకేత్ వేగి; ఎడిటర్ః శ్రీశైలం దారా; పాటలుః వెంకట కవి నరిగే; నిర్మాతః రమణ కొఠారు; కథ-స్క్పీన్ ప్లే- మాటలు-దర్శకత్వంః రామ్ బొత్స.