Anthele Kadhanthele Movie Press Meet
అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఎమోషన్ ప్యాక్డ్ మూవీ గా తెరకెక్కుతున్న చిత్రం “అంతేలే కథ అంతేలే”.రిధిమ క్రియేషన్స్ పతాకంపై తనీష్ ,వికాస్ వశిష్ట (సినిమాబండి) సహర్ కృష్ణన్ (హీరోయిన్) , శ్రీనివాస్ నటీ నటులుగా మహారాజశ్రీ,లంక వంటి చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందినటువంటి దర్శకుడు శ్రీ ఎం నివాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం “అంతేలే కథ అంతేలే” సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం కానున్న సందర్బంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
చిత్ర దర్శకుడు శ్రీ యం నివాస్ మాట్లాడుతూ :రిధిమ క్రియేషన్స్ పతాకంపై నా డైరెక్షన్ లో అంతేలే కథ అంతేలే” సినిమా నిర్మిస్తున్నాము. సినిమా బండితో అందరినీ మెప్పించి నటువంటి నటుడు వికాస్ వశిష్ట ఇంకా తనీష్ హీరోలుగా .సెహర్ కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.నెస్ట్ మంత్ షూటింగ్ వెళుతున్న ఈ సినిమా రాయలసీమ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో జరిగే కథ, అనేక భావోద్వేగాలు ఈ కథలో మిళితమై ఉంటాయి.ఈ చిత్రాన్ని అనంతరం, నల్గొండ, హైదరాబాద్ లల్లో మూడు షెడ్యూల్ లో షూటింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.
హీరో తనీష్ మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది అటెంప్ట్ చేస్తారు. అయితే ఇలాంటి సినిమాలు తక్కువ వచ్చినా ప్రేక్షకులు అదరిస్తారు. ఇప్పటి వరకు నాకున్న ఇమేజ్, నేను చేసిన పాత్రల నుంచి బయటకు వచ్చి చేస్తున్న అద్భుతమైన ఎమోషన్స్ తో కూడిన పాత్ర ఇది.ఇందులో హ్యూమన్ రిలేషన్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు గుండెలు బరువెక్కుతాయి. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ను మంచి విజయం సాదించాలి అన్నారు
హీరో వికాస్ వశిష్ట మాట్లాడుతూ .. సినిమా బండి తరువాత చేస్తున్న ఈ సినిమా టైటిల్ లోనే కథ ఉంది. ఇందులో మంచి ఎమోషన్ ఉంటుంది. మంచి టీం దొరికింది. నివాస్ గారు ఈ కథ చెప్పినపుడు. చాలా నచ్చింది. ఇందులో ఎక్కువ మాటలు ఉండవు కానీ ఎమోషన్ కథను క్యారీ చేస్తుంది.ఈ సినిమాను కూడా నాకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను.
హీరోయిన్ సహార్ కృష్ణన్ మాట్లాడుతూ..నా యాక్టింగ్ చూడకుండానే నన్ను ఇంత ఎమోషన్ ఉన్న పాత్రకు సెలెక్ట్ చేసుకున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. నా కిచ్చిన పాత్రను 100% ప్రేక్షకులను మెప్పించేలా పోసిస్తాను అన్నారు .
నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ .. సీనియర్ నటి గీతాంజలి రామకృష్ణ గారి అబ్బాయిని. ఇంతకుముందు నేను కొన్ని సినిమాలు చేశాను. ఈ సినిమాలో నాకు మంచి గుర్తింపు వచ్చే పాత్ర దొరికింది అన్నారు.
నటీ నటులు
తనీష్ (హీరో),వికాస్ వశిష్ట(సినిమాబండి హీరో), సహర్ కృష్ణన్ (హీరోయిన్),శ్రీనివాస్ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ :- రిధిమ క్రియేషన్స్,
నిర్మాణం : శ్రీ ఎమ్ నివాస్ ప్రొడక్షన్,
దర్శకుడు, నిర్మాత – శ్రీ ఎమ్ నివాస్.
Speaking on the occasion, director-producer M Nivaass said, “We will start the shoot in September. The story takes place in a remote village in Rayalaseema and is laced with a variety of emotions. The film will be shot in three schedules in Anantapur, Nalgonda and Hyderabad.”
Actor Tanish said, “Subjects of this sort are attempted rarely. And the audience love to watch such rare movies. I have come out of my image for this project. Human relations are going to be shown in a new way in this movie. It’s a heavy-duty film. I hope this film becomes a hit.”
Vikas Vasishta said, “I am doing this after an acclaimed movie like ‘Cinema Bandi’. The emotions are rich in ‘Antele Katha Antele’. I loved the director’s narration and immediately got on board. The film doesn’t have too many dialogues but the emotions are going to work big-time.”
Sahar Krishnan said, “I am happy that I have been chosen for this content-driven film even though I am an untested performer. I thank the director and producer.”
Actor Srinivas said, “I am the son of veteran actress Sitanjali Ramakrishna garu. I have previously done quite a few movies. I am hoping that this film will fetch me fame.”
Cast and crew:
Tanish, Vikash Vasishta, Sahar Krishnan, Srinivas and others.
Banner: Ridhima Creations
Producer: Sri M Nivaass Production
Director, producer: Sri M Nivaass