News

Needi Nadani video song out

By admin

August 27, 2022

 

ఇద్ద‌రు జ‌ర్న‌లిస్ట్  మిత్రుల  ప్ర‌య‌త్నం `నీదాని నాదని` త‌త్వ గీతం

` పేప‌ర్ బాయ్` చిత్రంలో  `బొంబాయి పోతావా రాజా ` , సుశాంత్ న‌టించిన `ఇచ‌ట వాహ‌న‌ములు నిల‌ప‌రాదు` చిత్రంలో `తియ్ బండి తియ్ ` సాంగ్ తో లిరిసిస్ట్ గా  టాలీవుడ్ లో మంచి గుర్తింపుని ఏర్ప‌రుచుకున్నారు వ‌ర్ధ‌మాన పాట‌ల ర‌చ‌యిత సురేష్ గంగుల‌.  ఇంత‌లో ఎన్నెన్ని వింత‌లో, సాఫ్ట్ వేర్ సుధీర్,  ఊరికి ఉత్త‌రాన‌, ఛ‌లో ప్రేమిద్దాం,  క‌ర‌ణ్ అర్జున్‌,  టెన్త్ క్లాస్ డైరీస్ ఇలా ప‌లు చిత్రాల‌కు పాట‌లు ర‌చించారు.  ప్ర‌స్తుతం సినీ రంగంలో ప‌లు చిత్రాల‌కు పాట‌లు రాస్తూ…ఇటీవ‌ల  మ‌నిషి త‌త్వాన్ని చెప్పే ఇండిపెండెంట్ సాంగ్ ర‌చించారు. ఈ పాట‌లో ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ అశోక్ ద‌య్యాల  లీడ్ రోల్ చేయ‌గా  యువ ర‌చ‌యిత దేవ్ ప‌వార్ డైర‌క్ష‌న్ చేశారు. ` నీది నాద‌ని ఏదీ కూడా లేదు ఇక్క‌డ‌…నీకు నాకు నిక‌ర‌మంటూ లేదు ఎక్క‌డ‌` అంటూ సాగే  ఈ  ఫిలాసిఫిక‌ల్ ఇండిపెండెంట్  సాంగ్ ను  ఈ రోజు లాంచ్ చేశారు.  పూర్తి పాట‌ను SURI SAGA  యూట్యూబ్ ఛాన‌ల్ లో చూడ‌వ‌చ్చు.

సాహిత్యంః సురేష్ గంగుల‌ డైర‌క్ష‌న్ః  దేవ్ ప‌వార్‌ మెయిన్ లీడ్ః అశోక్ దయ్యాల‌ సంగీతంః జాన్ భూష‌న్ కీ బోర్డ్ః       శ‌ర‌త్‌ కెమెరాః గ‌ద్ద‌ల క‌రుణాక‌ర్‌ ఎడిట‌ర్ః నిశాంత్‌ అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ః అర‌వింద్ గ‌మిని