తెలుగు

“”నటరత్నాలు”” ఫస్ట్ లుక్ చూపించారు.

By admin

October 27, 2022

“”నటరత్నాలు””ఫస్ట్ లుక్ చూపించారు.

గ్లామర్ క్వీన్ & ఎవర్ గ్రీన్ స్టార్ ‘వాణీ విశ్వనాథ్ ‘ సువర్ణ హస్తాలతో చాలా గ్రాండ్ గా ఫస్ట్ లుక్ తో పబ్లిక్ లోకి వచ్చారు “”నటరత్నాలు””.

ఎవరెస్ట్ ఎంటర్ టైన్మెంట్స్ కంపెనీ నుంచి మెడిసిన్ స్టూడెంట్ డా. దివ్య, ఎం.బి.ఏ. స్టూడెంట్ ఆనందాసు శ్రీ మణికంఠ నిర్మాతలు గా నిర్మించిన ఈ చిత్రానికి డేరింగ్ డైరెక్టర్ నర్రా శివనాగు దర్శకత్వం వహించారు.

ఇద్దరు చదువుకొనే స్టూడెంట్స్ కలిసి మొట్టమొదటి సారి నిర్మాతలుగా తెలుగు లో నిర్మించిన చిత్రం “”నటరత్నాలు”” కావడం ఒక విశేషం అయితే….ఎవర్ గ్రీన్ స్టార్ ‘వాణీ విశ్వనాథ్’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం మరో విశేషం… కామెడీ కింగ్స్ సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్ నటరత్నాలు కాగా…రెబల్ డైరెక్టర్ ఏ. ఎస్. రవి కుమార్ చౌదరి ఒక కీలక పాత్రలో అలరించారు. బిగ్ బాస్ 6 లో ప్రస్తుతం హల్ చల్ చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటున్న ఇనయా సుల్తానా “”నటరత్నాలు”” చిత్రం లో తన అందాలను విరజిమ్మటం ఇంకో విశేషం… అర్చన, టైగర్ శేషాద్రి, సుమన్ శెట్టి, విష్ణు వర్ధన్, ఎం. ఎన్. ఆర్. చౌదరి, అట్లూరి ప్రసాద్ లు కీలక పాత్రలు వహించారు.

సంగీతం శంకర్ మహదేవ్ అందించగా లిరిక్స్ సీతారామ్ చౌదరి అందించారు.