తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ-నంది సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్ 2020-22
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ-నంది సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్ 2020-22
-టీఎఫ్‌సీసీ ఛైర్మన్ డా॥ పతాని రామకృష్ణగౌడ్
సినీ పరిశ్రమకు కొత్త వారిని పరిచయం చేస్తూ… టాలెంట్ ఉన్న వారికి గుర్తింపునివ్వడంలో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఎప్పుడూ ముందుంటుంది. సినీ పరిశ్రమలోని నటీ నటులతోపాటు వివిధ శాఖలలో పనిచేసే ప్రతిభావంతులకు ‘టీఎఫ్‌సీసీ- నంది అవార్డ్స్’ ద్వారా గుర్తింపును ఇవ్వనుంది. గత ఎనిమిది. సంవత్సరాలుగా 10,000 మంది సభ్యులతో టీఎఫ్‌సీసీ కొనసాగుతుంది. టిఎఫ్‌సీసీ నిర్వహించే ‘టీ ఎఫ్‌సీసీ-నంది అవార్డ్స్’ కార్యక్రమం వచ్చే ఉగాది పండుగ రోజున భారీ స్థాయిలో నిర్వహించనుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఛైౖర్మన్ డా॥ పతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ..‘ తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ -నంది సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్ 2020-22’ ఉగాది రోజున నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, సూపర్‌స్టార్ రజనీకాంత్, మలయాళం హీరో మోహన్‌లాల్, కన్నడ స్టార్, హీరో యష్ మరియు మెగాస్టార్ చిరంజీవి గార్లను కలిసి ‘టీఎఫ్‌సీసీ-నంది సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్ 2020-22 కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. టీఎఫ్‌సీసీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ వంతు సహకారాన్ని అందజేస్తామని వారు చెప్పారు. విశేష ఆధరణ పొందిన తెలుగు, తమిళ్, మలయాళం మరియు కన్నడ భాషా చిత్రాలకు ఈ అవార్డ్స్ అందజేయడం జరుగుతంది. టీఎఫ్‌సీసీ నిర్వహిస్తున్న ‘టీఎఫ్‌సీసీ-నంది సౌత్ ఇండియా ఫిలిం అవార్డ్స్ 2020-22’ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం సహకారం మరియ మరింత తోడ్పాటును అందజేయాలని ఇటీవల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరు కావాలని కోరడం జరిగింది. టీఎఫ్‌సీసీ ఎప్పడూ తెలుగు చిత్రపరిశ్రమకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. చిత్ర పరిశ్రమలో విశిష్ఠ సేవలందించే వారిని సత్కరించుకుంటుందని’ అన్నారు.