తెలుగు

డా. సుప్రీమ్ వాయిస్ ఓవర్ తో “”నటరత్నాలు””

By admin

January 08, 2023

డా. సుప్రీమ్ వాయిస్ ఓవర్ తో “”నటరత్నాలు””

గతంలో సూపర్ స్టార్ కృష్ణ, మెగా బ్రదర్ నాగబాబు, విజయ శాంతి, రాజేంద్రప్రసాద్, సుమన్ లు హీరోలుగా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రాలలో బాల నటుడిగా నటించి, మెప్పించిన మాస్టర్ సుప్రీమ్ ఆ తరువాత “”లిటిల్ బుద్ధ “” చిత్రంలో గౌతమ్ బుద్దుని పాత్రలో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుని బౌద్ధ గురువు దలైలామా గారి ఆశ్శీసులు సైతం అందుకోవడమే కాక, “”లిటిల్ బుద్ధ “”, “”మాష్టర్ మైండ్స్ “” చిత్రాల్లో తన నటనకు గాను నంది అవార్డు, జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ అవార్డు బాల నటునిగా అందుకొని ప్రతిభను కనబరిచారు.

సూపర్ మేన్ పాత్రలో ఆర్తి అగర్వాల్ తో “”వనకన్య – వండర్ వీరుడు”” చిత్రంతో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయి ఫస్ట్ పాన్ ఇండియా బాల నటుడిగా మాస్టర్ సుప్రీమ్ గ్రేట్ అనిపించుకోవడం గొప్ప విశేషం.

తరువాత ఫారిన్ లో చదువు పూర్తి చేసుకొని డాక్టర్ గా జర్నీ సాగిస్తున్న డా. సుప్రీమ్ “”నటరత్నాలు “” మూవీ కి తన కంచు కంఠంతో వాయిస్ ఓవర్ అందజేసి అదనపు ఆకర్షణ అందించటం ఆనందంగా ఉందని దర్శక, నిర్మాతలు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.