News

Dr Ravi Panasa Appointed As Trade Commissioner For Zimbabwe

By admin

February 14, 2023

 

జింబాబ్వే ట్రేడ్ కమిషనర్‌గా నియమితులైన డాక్టర్ రవి కుమార్ పనస

జింబాబ్వే ఇండియా ట్రేడ్ కౌన్సిల్‌కు రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జింబాబ్వే ట్రేడ్ కమీషనర్‌ రాయబారిగా డాక్టర్ రవి కుమార్ పనస నియమితులైనారు. న్యూఢిల్లీలో ఇండియన్ ఎకనామిక్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ డాక్టర్. ఆసిఫ్ ఇక్బాల్ మరియు డిప్యూటీ ట్రేడ్ & ఇన్వెస్ట్‌మెంట్ మినిస్టర్ మరియు జింబాబ్వే రాయబారి  రాజ్ కుమార్ మోడీ డాక్టర్ రవి కుమార్ పనస కి అందచేశారు.

పనస గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన డా.రవి పనస ఈ కొత్త బాధ్యతను చేపట్టడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “భారత్ మరియు జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సంబంధాలను నెలకొల్పడం మరియు కొత్త శిఖరాలను చేరుకోవడం నా లక్ష్యం. ఏప్రిల్ 2023లో రానున్న భారత ప్రతినిధి బృందం భారత్ వైపు నుండి విపరీతమైన ఆసక్తిని చూస్తుంది” అన్నారు.

డా.పనస వ్యాపార ప్రపంచంలో ఎంతో అనుభవాన్ని సంపాదించడంతో పాటు, వ్యాపార నిర్వహణ మరియు మీడియా ప్రమోషన్‌లలో UNESCO ISCED నుండి డాక్టరేట్‌ పొందారు. ఆయన నాయకత్వంలోని పనస గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఎంఎల్ లగ్జరీ స్పిరిట్స్, పనస మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ మరియు పనస ఇన్‌ఫ్రా అండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి.

ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తలు పాల్గొన్నారు. ఆఫ్రికన్ ప్రాంతంతో భారతదేశ సంబంధాలను మెరుగుపరచడం యొక్క ప్రాముఖ్యత గురించి జింబాబ్వే రాయబారి శ్రీ సిబుసిసో బుసిమోయో మాట్లాడారు. అలాగే ఈ ప్రాంతంలోని ఇతర ద్వీప దేశాలకు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చిన ఆయన తెలంగాణ రాష్ట్రం నుండి లభించిన స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు.