గర్ల్స్ సేవ్ గర్ల్స్ కాన్సెప్ట్ తో `నేనే సరోజ’ ఉరఫ్ కారంచాయ్ చిత్రం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్.త్రి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతోన్న `నేనే సరోజ` (కారం ఛాయ్ ట్యాగ్ లైన్) చిత్రానికి సంబంధించిన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు . ఈ చిత్రానికి డా.సదానంద్ శారద నిర్మాత. శ్రీమాన్ గుమ్మడ వెల్లి దర్శకుడు. కౌశిక్ బాబు , శాన్వి, మేఘన హీరో హీరోయిన్లు. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్బంగా `నేనే సరోజ` చిత్రం గురించి `బేటీ బచావ్ బేటీ పడావ్ ` రాష్ట్ర కన్వీనర్ గీతా మూర్తి మాట్లాడుతూ…“`గర్ల్స్ సేవ్ గర్ల్స్ కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రం ఆద్యంతం ఆడ పిల్లలపై వివక్షత తొలిగించడానికి , ఆడ పిల్ల అంటే అరిష్టం కాదు …అవకాశం వస్తే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని ఆడపిల్లలకీ, తల్లిదండ్రులకీ , సమాజానికి ఒక దిశా నిర్దేశం చేసేనట్టుగా ఉండే చిత్రమిది. ఈ చిత్రాన్ని ఆదరించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇంత గొప్ప ప్రయత్నాన్ని చేస్తోన్న దర్శక నిర్మాతలను అభినందిస్తున్నా“ అన్నారు.
రచయిత, నిర్మాత డా. సదానంద్ శారద మాట్లాడుతూ…` కారం చాయ్ అనే పదాన్ని అమ్మాయిలకు అస్త్రంగా ఇస్తూ వారిలో చైతన్యానికీ, పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలనీ కోరుకుంటున్నాం. దీన్ని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సందేశాత్మక చిత్రంగా గుర్తించి ప్రత్యేకమైన రాయితీలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుపుకుంటోన్న ఈచిత్రాన్ని త్వరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.
కౌశిక్ బాబు, శాన్వి, మేఘన, సుమన్, చంద్రమోహన్, ఆనంద చక్రపాణి, ఆర్ యస్ నంద, మహేశ్వరి, రాధిక, సీతామహాలక్ష్మి, అబిత, మధు, వింజమూరి, తపస్వి, బందెల సుధాకరరావు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః రమేష్ ముక్కెర; పాటలుః సుద్దాల అశోక్ తేజ, శ్రీమతి పాకాల శారద; సింగర్స్ః గీతా మాధురి, హరిప్రియ, మాళవిక, డా.సత్య పవన్; సినిమాటోగ్రాఫర్ః కర్ల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-నిర్మాతః డా.సదానంద్ శారద; దర్శకత్వంః శ్రీమాన్ గుమ్మడ వెల్లి.