*ముస్తాబవుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘హలో ఎవరు?’ చిత్రం*
తెలుగు తెరపైకి మరో సర్‌ఫ్రైజ్ సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతోంది. శ్రీశివసాయి ఫిల్మ్స్ బ్యానర్‌పై, మహేశ్వరి నందిరెడ్డి సమర్పణలో, వెంకట్‌రెడ్డి నంది దర్శకనిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ‘హలో ఎవరు?. ఈ సినిమా ద్వారా హీరో విజయ్ పాపిరెడ్డి కటకం – హీరోయిన్ సౌమ్యశ్రీ ఉంతకల్ ,విలన్ గా వినాయక్ పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఎడిటింగ్, డబ్బింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డీఐ పనులు జరుపుకుంటోంది.
ఈ క్రైం ఆండ్ హరర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు దర్శకనిర్మాత వెంకట్‌రెడ్డి నంది తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని, ఇండస్ట్రీలో ఈ చిత్రానికి స్పెషల్ క్రేజ్ రావడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మే నెలలో ‘హలో ఎవరు?’ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.
నటీనటులు: విజయ్ పాపిరెడ్డి కటకం(హీరో), సౌమ్యశ్రీ ఉంతకల్ (హీరోయిన్), వినాయక్ (విలన్ ), గాదె సతీష్, యుగ దుర్గ నరేష్ , వేదశ్రీ మల్ల, చిత్రం శ్రీను, ఘర్షణ శ్రీనివాస్, బస్టాప్ కోటేశ్వరరావు, జబర్‌దస్త్ రాజమౌళి, గబ్బర్ సింగ్ సాయి, గబ్బర్ సింగ్ డూప్ రాజశేఖర్ తదిరులు నటించారు.
డైలాగ్ రైటర్: ఎలకం వీరబ్రహ్మ కో-డైరెక్టర్: అందెల చిరంజీవి ఎడిటింగ్: సాయి కుమార్ ఆకుల, నరేష్ దొరపల్లి డీవోపీ: పి.శ్రీనివాస్ మ్యూజిక్ డైరెక్టర్: డ్రమ్స్ రాము కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: వెంకట్‌రెడ్డి నంది