*పబ్లిసిటీ పోస్టర్ మరియు మోషన్ టైటిల్ ఆవిష్కరణలో “నటరత్నాలు” మూవీ*
బాపట్ల MP గౌరవనీయులు శ్రీ నందిగం సురేష్ గారి సువర్ణ హస్తాలతో పబ్లిసిటీ పోస్టర్ మరియు మోషన్ టైటిల్ ఆవిష్కరణ 06.04.2023.
ఎవరెస్ట్ ఎంటర్టెయిన్మెంట్స్ పతాకంపై డా.దివ్య, ఎలమాటి చంటి, ఆనందాసు శ్రీ మణికంఠలు నిర్మాతలుగా నర్రా శివనాగు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “నటరత్నాలు”. క్రైమ్, కామెడీ, మర్డర్ మిస్టరీ నేపధ్యంగా వస్తున్న ఈ చిత్రంలో బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా, కామెడీ కింగ్స్ రంగస్థలం మహేష్, సుదర్శన్ రెడ్డి, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, అర్చనలు ప్రధాన పాత్రలు పోషించారు.
YCP పార్లమెంట్ సభ్యులు శ్రీ నందిగం సురేష్ గారి సువర్ణ హస్తాలతో ఈ చిత్రం పబ్లిసిటీ పోస్టర్ మరియు మోషన్ టైటిల్ ఆవిష్కరణ జరిగింది.