తెలుగు

మాలాశ్రీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న‌ `మార‌ణాయుధం` మూవీ పోస్ట‌ర్ లాంచ్

By admin

November 12, 2023

 

మాలాశ్రీ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో తెర‌కెక్కుతోన్న‌ `మార‌ణాయుధం` మూవీ పోస్ట‌ర్ లాంచ్ మాలాశ్రీ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో శ్రావ్య కంబైన్స్ ప‌తాకంపై గురుమూర్తి సునామి ద‌ర్శ‌క‌త్వంలో  కోమ‌ల న‌ట‌రాజ తెలుగు , క‌న్న‌డ భాష‌ల్లో నిర్మిస్తోన్న చిత్రం `మార‌ణాయుధం`. దీపావ‌ళి సంద‌ర్భంగా  ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ లాంచ్ చేశారు.  క‌న్న‌డ‌లో `మ‌ర‌కాస్త్ర` గా దీని టైటిల్ నిర్ణ‌యించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు గురుమూర్తి సునామి మాట్లాడుతూ..“మాలాశ్రీ గారు ఈ యాక్ష‌న్ డ్రామాలో ఓ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించారు. ఆయుధ‌మే ఈ దేశాన్ని ర‌క్షిస్తుంది అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో చాలా గ్రాండ్ గా సినిమా రూపొందించాం. దీపావ‌ళి కానుక‌గా ఈ రోజు మా చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ లాంచ్ చేశాము. త్వ‌ర‌లో సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తాం` అన్నారు. మాలాశ్రీ, అయ్య‌ప్ప పి.శ‌ర్మ‌, హ‌ర్షిక పూన‌చా, ఆనంద్ ఆర్య ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి సంగీతంః మిరాకిల్ మంజు; ఎడిట‌ర్ః విశ్వ ఎన్ ఎమ్‌;  సినిమాటోగ్ర‌ఫీః అరుణ్ సురేష్‌; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కె.వెంక‌టేశ్వ‌ర రావు;  నిర్మాతః కోమ‌ల న‌ట‌రాజ‌; క‌థ‌-స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వంః గురుమూర్తి సునామి.