తెలుగు

జనవరి 5న వస్తున్న “14డేస్ లవ్”

By admin

December 29, 2023

జనవరి 5న వస్తున్న “14డేస్ లవ్”

సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హరిబాబు దాసరి నిర్మాతగా అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో.. “నాగరాజు బోడెం”గారి దర్శకత్వంలో నిర్మించిన యూత్ ఫుల్ అండ్ కుటుంబ కథా చిత్రం “14 డేస్ లవ్” ..మనోజ్ పుట్టూర్ చాందిని భాగవని హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రంలో రాజా రవీంద్ర సనా సునూర్ కీలక పాత్రలు పోషించారు..అంజలి ఐడ్రీమ్ రాజా శ్రీధర్ తదితరులు నటించారు..

కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది అన్న కోణంలో దర్శకుడు నాగరాజు బోడెం అత్యంత ఆసక్తికరంగా చిత్రీకరించారు..సంప్రదాయ విలువలున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరి 5న విడుదలకు సిద్దంగా ఉంది.

ఈ చిత్రానికి.. మాటలు: గౌరీశ్వర్. శివప్రసాద్ సామల కెమెరా: కన్నన్ మునస్వామి సంగీతం: కిరణ్ వెన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్: యస్.కె. బాజి సాహిత్యం: గిరిపట్ల ఎడిటర్: యస్.యస్.వి.సుంకర ప్రొడక్షన్ డిజైనర్; శ్రీజోయ్ శ్రీను

కో ప్రొడ్యూసర్స్: A వేణు లైన్ ప్రొడ్యూసర్స్: రాజేష్ కుమార్ దాసరి వినీత్ ప్రకాష్ దాసరి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రకళ దాసరి