*ఘనంగా “ఇట్లు… మీ సినిమా” ట్రైలర్ లాంఛ్* మరియు *ప్రీ-రిలీజ్ ఈవెంట్*
లిటిల్ బేబీస్ క్రియేషన్స్ పతాకంపై నోరి నాగ ప్రసాద్ నిర్మాతగా, దర్శకుడు హరీష్ చావా రూపొందిస్తున్న చిత్రం “ఇట్లు… మీ సినిమా”. అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల హీరో హీరోయిన్లుగా, ప్రదీప్, అమ్మ రమేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నలుగురు యువకులు తమకున్న ప్యాషన్ తో, సినిమా రంగానికి వచ్చి వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, వాళ్ళు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారా లేదా అనే కథాంశంతో లవ్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ కలగలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఇట్లు… మీ సినిమా” ఈనెల 21న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో
*దర్శక నిర్మాత నాగబాల సురేష్ మాట్లాడుతూ* – రెండు దశాబ్దాలుగా పైగా ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసిన బాలరాజు “ఇట్లు… మీ సినిమా” మూవీతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా మారడం సంతోషంగా ఉంది. మంచి సినిమాకు చిన్నా పెద్దా తేడా లేదు. “ఇట్లు… మీ సినిమా” మూవీ విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
*దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ* – “ఇట్లు… మీ సినిమా” కంటెంట్ చాలా బాగుంది. డైలాగ్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. మంచి క్వాలిటీతో సినిమాను రూపొందించారు. ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.
*దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ* – “ఇట్లు… మీ సినిమా” దర్శకుడు హరీష్ చావా ప్రతిభావంతుడు. సినిమాను బాగా రూపొందించాడు. మేము ఏమాత్రం టైమ్ ఉన్నా చిన్న సినిమాకు సపోర్ట్ చేసేందుకు వస్తుంటాము. ఇవాళ ఈ సినిమాను బ్లెస్ చేసేందుకు ఇంతమంది శ్రేయాభిలాషులు ఈవెంట్ కు రావడం సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత భారీ సంఖ్యలో వీక్షకులు హాజరైన ప్రెస్ మీట్ ఇదే అనుకుంటా. అన్నారు.
*నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ*- కొత్త ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఫిలింమేకింగ్ మీద అవగాహన లేక నష్టపోతుంటారు. అలా వచ్చేవారు ఎవరైనా అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకోండి. “ఇట్లు… మీ సినిమా” మూవీకి ఏ సపోర్ట్ కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. సినిమా బాగుంటే చిన్న చిత్రాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తాయి. ఈ సినిమా కూడా అలాగే సక్సెస్ కావాలి. అన్నారు.
*దర్శకుడు సముద్ర మాట్లాడుతూ* – మన తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న సమయం ఇది. హరీష్ చావా లాంటి దర్శకుడు రాజమౌళి అంత పేరు తెచ్చుకోవాలి అన్నారు.
*నిర్మాత టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ* – “ఇట్లు… మీ సినిమా” అనే పేరులోనే ఇది మన సినిమా అనే అర్థం ఉంది. అంటే ఇండస్ట్రీలోని వాళ్ల అందరి సినిమా అనుకోవాలి. వైద్యుడిగా నోరి దత్తాత్రేయుడు గారు వరల్డ్ ఫేమస్, అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్ నోరి నాగ ప్రసాద్ గుర్తింపు పొందాలి. దర్శకుడు హరీష్ చావా మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవాలని కోరుతున్నా అన్నారు.
*నిర్మాత సాయివెంకట్* మాట్లాడుతూ.. ట్రైలర్, టీజర్ బాగున్నాయి. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుంది అన్నారు.
*దర్శకుడు హరీష్ చావా మాట్లాడుతూ* – “ఇట్లు… మీ సినిమా” రూపొందించే క్రమంలో మొదటి నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నారు మా ప్రొడ్యూసర్ నోరి నాగప్రసాద్ గారు. ఎలాంటి సినిమా చేయాలని మేము డిస్కస్ చేస్తున్నప్పుడు నాగ ప్రసాద్ గారే ఏ కథో ఎందుకు మన కథే తీద్దాం. మనం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు పడిన ఇబ్బందులతోనే సినిమా చేద్దాం అని అన్నారు. ఇలాంటి సినిమా చేస్తే సినిమా పరిశ్రమలోకి వచ్చేవారికి అవగాహన ఏర్పర్చినట్లు అవుతుందని అన్నారు. ఆయన సలహాతోనే “ఇట్లు… మీ సినిమా” మూవీ ప్రారంభించాం. చిత్ర పరిశ్రమలోకి రావాలనుకుంటున్న వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది మేము ఈ కథలో చూపించాం. ప్రేక్షకులందరికీ తప్పుకుండా నచ్చుతుంది. చిన్న సినిమా అని చూడకుండా థియేటర్స్ కు వెళ్లండి. మీ అందరూ అన్ని ఎమోషన్స్ ఉన్న “ఇట్లు… మీ సినిమా” మూవీని ఎంజాయ్ చేస్తారు. ఇవాళ మమ్మల్ని బ్లెస్ చేసేందుకు వచ్చిన అతిథులు, మా స్నేహితులందరికీ థ్యాంక్స్. అన్నారు.
*నిర్మాత నోరి నాగ ప్రసాద్ మాట్లాడుతూ* – మా “ఇట్లు… మీ సినిమా” మూవీ ట్రైలర్ లాంఛ్ కు అతిథులుగా వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి వచ్చిన స్నేహితులు, సన్నిహితులకు థ్యాంక్స్. ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్ గా ఆర్గనైజ్ చేసింది మా బాలరాజు అన్న. అతిరథ మహారథులు అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చారు. మా మూవీకి శ్రీనివాస్, రామారావు అని ఇద్దరు మిత్రులు మాకెంతో సపోర్ట్ చేశారు. “ఇట్లు… మీ సినిమా” మూవీతో ఒక మంచి ప్రయత్నం చేశాం. చిత్ర పరిశ్రమలో కొత్త వాళ్లు పడే ఇబ్బందులను ఆసక్తికరంగా ప్రేక్షకులకు నచ్చేలా చూపించాం. అన్ని ఎమోషన్స్ కలిపిన చిత్రమిది. ఈ నెల 21న “ఇట్లు… మీ సినిమా” మూవీని థియేటర్స్ లోకి గ్రాండ్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
*నటి మంజుల మాట్లాడుతూ* – “ఇట్లు… మీ సినిమా” మూవీలో మంచి క్యారెక్టర్ చేశాను. చాలా ఎమోషనల్ గా నా పాత్ర సాగుతుంటుంది. మీరు ట్రైలర్ లో నా క్యారెక్టర్ చూసే ఉంటారు. ఈ సినిమాలో అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు.
*హీరోయిన్ వెన్నెల మాట్లాడుతూ* – “ఇట్లు… మీ సినిమా” మూవీలో అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నా. ఒక మంచి మూవీలో భాగమవడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్. “ఇట్లు… మీ సినిమా” మూవీని థియేటర్స్ లో చూసి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
*హీరో అభిరామ్ మాట్లాడుతూ* – “ఇట్లు… మీ సినిమా” మూవీలో అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ నోరి నాగప్రసాద్, దర్శకుడు హరీష్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా తీస్తున్న టైమ్ కంటే ఇప్పుడు స్లిమ్ గా మారాను. ఈ సినిమాలో కొత్త నటీనటులు అని చూడకండి. కేవలం కంటెంట్ చూసి మా మూవీ చూసేందుకు రమ్మని కోరు తున్నా అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇతర కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ పాల్గొన్నారు.
*నటీనటులు* – అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల, ప్రదీప్, అమ్మ రమేష్ తదితరులు
*టెక్నికల్ టీమ్* – డాన్స్: తాజ్, పి ఆర్ ఓ: చందు రమేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బూస్సా బాలరాజు, నిర్మాత: నోరి నాగ ప్రసాద్, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరీష్ చావా.