తెలుగు

*రెడ్ బుక్* (షాడో టీమ్)

By admin

August 06, 2024

*రెడ్ బుక్* (షాడో టీమ్)

ఏపీలో క్రిమినల్స్ ని రెడ్ బుక్ నిద్రపోనివ్వడం లేదు. రెడ్ బుక్ లో ఫస్ట్ పేరు ఎవరిది? లీగల్ గా ఫస్ట్ ఏ క్రిమినల్ ని షాడో టీమ్ ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. నేరాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ హీరోలే! అయితే ఇల్లీగల్ క్రిమినల్ హీరోలంతా లీగల్ గా జీరోలయ్యే టైమ్ వచ్చింది. అందుకే షాడో టీమ్ రెడ్ బుక్ ని ఆయుధంగా తయారు చేసింది. భారత రాజ్యాంగం ప్రకారం రెడ్ బుక్ ని దాటి ఏ క్రిమినల్ తప్పించుకోలేడు. కాబట్టి రాజ్యాంగం ఒక పవర్ ఫుల్ షాడో టీమ్ ని ఏర్పాటు చేసింది. ఆ షాడో టీమ్ ఎవరు, ఏమిటనీ.. ఆ రెడ్ బుక్ ఎవరిని క్రిమినల్ గా రుజువు చేయబోతుందనీ, ఎదురు చూసేవారికి నిజాన్ని నిర్భయంగా చెప్పే డైనమిక్ డైరెక్టర్ నర్రా శివనాగు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని సినీ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారని మీడియా ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇంతకు మునుపే శివనాగు బెజవాడ కథతో “దేవినేని” చిత్రాన్ని సంచలనం చేసిన విషయం అందరికీ తెలిసిందే. మరి రెడ్ బుక్ అస్త్రంతో ఎవరిని ఎటాక్ చేస్తాడో త్వరలో చూద్దాం.