“రామ్ నగర్ బన్నీ” మూవీ రివ్యూ
బ్యానర్ :శ్రీ సుమనోహర ప్రొడక్షన్స్
సినిమా పేరు:రామ్ నగర్ బన్నీ
నిర్మాతలు:ప్రభాకర్ పొడకండ్ల,మలయజ పొడకండ్ల
తారాగణం: చంద్రహాస్, విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితు మంత్ర, మురళి గౌడ్,సుజాత తదితరులు
సంగీతం:అశ్విన్ హేమంత్
ఫొటోగ్రఫీ: అష్కర్ అలీ
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ మహత్
విడుదల తేదీ: అక్టోబర్ 4 , 2024
సుదీర్ఘ కాలంనుండి తన నటనతో ప్రేక్షకులని అలరిస్తూ బుల్లితెర మెగాస్టార్ గా పేరుగాంచిన ప్రముఖ సినీ, టివి నటుడు ఈటివి ప్రభాకర్ నట వారసుడు చంద్ర హాస్ తొలిసారి నటించిన రామ్ నగర్ బన్నీ(ram nagar bunny)ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం రండి.
కథ: జులాయిగా తిరిగే సగటు కుర్రాడు బన్నీ (చంద్రహాస్). తండ్రి ఆటో నడిపి సంపాదించే సంపాదనతో, అందంగా కనిపించిన ప్రతి అమ్మాయిని ప్రేమిస్తూ, ప్రేమ అంటే ఏమిటో అనే అర్థం కూడా తెలుసుకోకుండా ఒకరి తర్వాత ఒకర్ని ప్రేమించుకుంటూ వెళ్తుంటాడు. ఈ క్రమంలో పరిచయమైన అమ్మాయిలందరిలో తన ఇంట్లో పని మనిషిగా వర్క్ చేస్తున్న అమ్మాయి (విస్మయ) తనకు బెస్ట్ అని తెలుసుకొనేలోపు బన్నీ జీవితం తార (రీతు మంత్ర) చేతిలో పడిపోతుంది.
అసలు ఈ తార ఎవరు? బన్నీ ఆమె దగ్గర ఎలా ఇరుక్కున్నాడు? ప్రేమ విలువ ఎలా తెలుసుకున్నాడు? అనేది “రామ్ నగర్ బన్నీ” కథ.
నటీనటుల నటన గురించి:
బిరుదుకి తగ్గట్టే తన యాటిట్యూడ్ తో చంద్రహాస్ ఒక రేంజ్ పెర్ఫార్మెన్సు ని ప్రదర్శించాడు. స్క్రీన్ ప్రెజన్స్ కూడా చాలా బాగుంది.పెద్ద హీరో స్థాయిలో ఒంటి చేత్తో సినిమాని ముందుండి నడిపించాడు.ముఖ్యంగా డాన్స్ లలో వీరవిహారం చేశాడు. చంద్రహాస్ రూపంలో ఇండస్ట్రీ కి ఇంకో హీరో దొరికినట్టే.
స్టార్ హీరో ఉన్న సినిమాలో ఒక్క హీరోయిన్‌కే స్కోప్ దక్కడం లేదు. అలాంటిది ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ ఉన్నా కూడా.. ప్రతి పాత్రకు ప్రాధాన్యత కల్పించారు. యూత్ సినిమా కాబట్టి.. కిస్‌లు రొమాన్స్ కామనే కానీ.. వాటిని కూడా మోతాదు మించకుండా.. కథకి ఎంత అవసరమో అంతే చూపించారు. విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రీతూ మంత్ర ఆయా పాత్రల్లో ఆకట్టుకున్నారు. మెయిన్ లీడ్ హీరోయిన్ విస్మయ శ్రీనే కాబట్టి.. తన పరిధి మేరకు బాగానే మెప్పించింది. బన్నీ తండ్రిగా మురళీధర్ గౌడ్ తన మార్క్ నటనతో ఇరగదీశాడు. నవ్వులు పూయించారు. బన్నీ ఫ్రెండ్స్ కొత్తవాళ్లు. కానీ బాగా చేశారు. అలాగే రివ్యూ లక్ష్మణ్‌కి మంచి క్యారెక్టర్ పడింది.
టెక్నీషియన్లు పనితీరు:
టెక్నీకల్ గా సినిమాకి మంచి టెక్నీషియన్లు పనిచేశారు. క్వాలిటీ అన్ని విషయాల్లోనూ అద్భుతంగా కనిపిస్తుంది. అష్కర్ అలీ కెమెరా వర్క్ చాలా రిచ్‌గా ఉంది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదనటానికి ఇదే నిదర్శనం. అలాగే మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ కూడాచాలా బాగుంది. ఆర్ట్స్ వర్క్ అదిరిపోయింది. అశ్విన్ హేమంత్ మ్యూజిక్ బాగుంది. బీజీఎం కూడా అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు. శ్రీనివాస్ మహత్ రచనా దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లోనే కొట్టొచ్చినట్టు కనపడింది
ఫైనల్ గాః కమర్షియల్ యూత్ లవ్ స్టోరీ. “యాటిట్యూడ్ స్టార్ ” ట్యాగ్ కి అర్హుడే.
రేటింగ్ః 3/5