మరో కర్తవ్యం..”ఝాన్సీ ఐపీఎస్”. నవంబర్ 29న గ్రాండ్ రిలీజ్
ఆర్ కె ఫిలిమ్స పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం నవంబర్ 29న గ్రాండ్ గా విడుదలకు సిద్దమైంది. అత్యధిక థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేశారు నిర్మాత ఆర్.కె. గౌడ్.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన “ఝాన్సీ ఐపిఎస్” చిత్రాన్ని తెలుగులో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాను. లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రం మా ఆర్ కె బ్యానర్ కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది లక్మీ రాయ్ చేసిన మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్ లో ఉంటాయి. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు అద్భుతమైన 8 ఫైట్స్ కంపోజ్ చేశారు. మాస్ ప్రేక్షకులను ఫైట్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి విద్యార్థులను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి, యువత భవిష్యత్ ను పెడదారి పట్టించే, డ్రగ్స్ ముఠా ఆటకట్టించే ఐపిఎస్ ఆఫీసర్ గా, గ్రామాల్లో రౌడీల అగడాలకు అడ్డుకట్టవేసే ఉగ్రనారిగా, కుర్రకారును ఉర్రూతలూగించే గ్లామర్ పాత్రల్లో లక్మీ రాయ్ తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించింది. విజయశాంతి గారు నటించిన కర్తవ్యం లాంటి సినిమా ఇది. కర్తవ్యం చిత్రంతో విజయశాంతి గారు లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు. కర్తవ్యం చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో, ఈ “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం కూడా ఘన విజయాన్ని సాధిస్తుంది. త్వరలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నాం. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 29న అత్యధిక థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రానికి విజయాన్ని అందించాలని కోరుతున్నాను అన్నారు.