*నైజాంలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న లక్మీ రాయ్ “ఝాన్సీ ఐపీఎస్”, ఈ నెల రెండో వారంలో ఆంధ్ర, సీడెడ్ లో గ్రాండ్ రిలీజ్ కానున్న మూవీ*
ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళంలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం గత నెల 29న నైజాంలో ఏరియాలో గ్రాండ్ గా రిలీజైంది. 45 థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మహిళా ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరిస్తున్నారు. నైజాం ఏరియాలో వస్తున్న అపూర్వ ఆదరణ నేపథ్యంలో ఈ నెల రెండో వారంలో ఆంధ్ర, సీడెడ్ లో “ఝాన్సీ ఐపీఎస్” సినిమాను ఘనంగా విడుదల చేసేందుకు నిర్మాత ఆర్.కె. గౌడ్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా
*చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ*…మా “ఝాన్సీ ఐపీఎస్” సినిమాను ఇటీవల నైజాం ఏరియాలో 45 థియేటర్స్ లో ఘనంగా రిలీజ్ చేశాం. ప్రతి సెంటర్ నుంచి సూపర్ హిట్ టాక్ వస్తోంది. హౌస్ పుల్ కలెక్షన్స్ తో సినిమా ప్రదర్శితమవుతోంది. మహిళా ప్రేక్షకులు సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమాను ఆదరిస్తున్నారు. మూవీలో మూడు డిఫరెంట్ రోల్స్ లో లక్మీ రాయ్ పర్ ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా లక్ష్మీరాయ్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలిచాయని ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఈ ఆదరణతో ఆంధ్ర, సీడెడ్ లో ఈ నెల రెండో వారంలో “ఝాన్సీ ఐపీఎస్” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. నైజాంలో వచ్చిన సక్సెస్ ను ఆంధ్ర, సీడెడ్ లోనూ ప్రేక్షకులు అందిస్తారని ఆశిస్తున్నాం అన్నారు.