*వివరెడ్డి హీరోగా* *’ఓ తండ్రి తీర్పు’ డిసెంబర్* *27న థియేటర్స్ లో విడుదల*

*వివరెడ్డి హీరోగా*
*’ఓ తండ్రి తీర్పు’ డిసెంబర్* *27న థియేటర్స్ లో విడుదల*

ఏవికె ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా, రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన దర్శకత్వ పర్యవేక్షణలో ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో

వివ రెడ్డి హీరోగా ‘ఓ తండ్రి తీర్పు’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది .

సహృదయులు దైవాంశ సంభూతులు డాక్టర్ కెవి రమణ చారి గారి ఆశీస్సులతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సినిమా ద్వారా వివ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు.

ప్రతాప్ భీమవరుపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రచన పర్యవేక్షణ రాజేంద్రరాజు కాంచనపల్లి.

కుటుంబ విలువలతో ఓ తండ్రి తీర్పు సినిమాను నిర్మించారు. తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులపై లేకపోవటం ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది.

ఓ తండ్రి తీర్పు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యాయి.
ఈ చిత్రంలో కొడుకుగా వివ రెడ్డి చేస్తున్న ప్రధానమైన పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాత శ్రీరామ్ దత్తి అన్నారు.

ఈ సినిమా డిసెంబర్ 27న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సేవా సార్వభౌములు పుణ్య దంపతులు
కీ.శే లయన్స్ శ్రీమతి ఆరిగపూడి కృష్ణ కుమారి , కీ.శే డాక్టర్ ఆరిగపూడి విజయ్ కుమార్ గార్లకు ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నారు.
ఓ తండ్రి తీర్పు సినిమాకు
కీ.శే డాక్టర్ ఆరిగపూడి విజయ్ కుమార్ గారు సమర్పకులుగా ఉండడం విశేషం.

నటీనటులు:
వివ రెడ్డి, రాజేంద్ర, ప్రతాప్, శ్రీరామ్, కునాల్, కుషాల్, చిత్రం బాషా, అనురాధ, రారాజు, సురభి శ్రావణి, పునర్వి, రమ్య,శివాజీ, రామకృష్ణ, మంజుల, స్వాతి, జ్యోతి, కెవిఎల్ నరసింహారావు, లక్ష్మీనారాయణ, కెవిఎన్ .రాజు, పేరిణి శ్రీకాంత్, గుండు బ్రదర్స్, జబర్దస్త్ నాగరాజు, లక్ష్మీ కిరణం, వాసు, సాధనాల వెంకటస్వామి నాయుడు, మిమిక్రి రాజు, రాము, అయ్యప్ప, ప్రమీల, అమృత వర్షిణి, సాయి చరణ్, సాయి తేజ తదితరులు

సాంకేతిక నిపుణులు:
నిర్మాత: లయన్ శ్రీరాం దత్తి
దర్శకత్వం: ప్రతాప్ భీమవరపు
రచన , దర్శకత్వ పర్యవేక్షణ: రాజేంద్రరాజు కాంచనపల్లి

సినిమాటోగ్రఫీ: సురేష్ చెటిపల్లి
సంగీతం: మధు బాపు శాస్త్రి
పాటలు: రాజేంద్ర రాజు కాంచనపల్లి,హరితస , కళా రత్న బిక్కి కృష్ణ, డాక్టర్ దాసరి వెంకటరమణ
నేపధ్య సంగీతం: చరణ్ అర్జున్
కో డైరెక్టర్స్: శేషు కుమార్,కళింగ రంగనాథ్ కొత్తకోట
పబ్లిసిటీ డిజైనర్: వివ రెడ్డి
ఆర్ట్ : దుద్దుపూడి ఫణి రాజు
ప్రొడక్షన్ చీఫ్ : రాంబాబు రామకృష్ణ రాజు.
డాన్స్ మాస్టర్: గిరి
ప్రొడక్షన్ : శివ
మేకప్ : కరుణాకర్, లక్ష్మి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *