*ఫిల్మ్ క్రిటిక్స్ సంస్థ ఎప్పుడూ మా అనుబంధ సంస్థే* -టియుడబ్ల్యుజే అధ్యక్షులు విరాహత్ అలీ
హైదరాబాద్:డిసెంబర్28 ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఎప్పుడూ తమ అనుబంధ సంస్థేనని, దశాబ్దాలుగా ఆ సంస్థ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లోనే కొనసాగుతోందని, ఇక ముందు కూడా కొనసాగుతుందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అధ్యక్షులు విరాహత్ ఆలీ స్పష్టం చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లోని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌కు చెందిన కార్యాలయాన్ని తిరిగి తమకు స్వాధీనం చేయాలని ఫిలిం క్రిటిక్స్ అసొసియేషన్ అధ్యక్షులు సురేష్ కొండేటి సారధ్యంలో శనివారం మధ్యాహ్నం టియుడబ్ల్యుజే అధ్యక్షులు విరాహత్ ఆలీని వారి కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన్ను శాలువా, పూలబొకేతో సత్కరించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు లక్ష్మణరావు గారు మాట్లాడుతూ… ఎన్నో దశాబ్దాలుగా ఇదే బిల్డింగ్ కేంద్రంగా మా సంస్థ నడుస్తోంది. ఇటీవల కొంత రాకపోకలు నెమ్మదించడం కరెక్టే. అయితే ఇక నుంచి రెగ్యులర్‌గా మా కార్యకలాపాలు ఇక్కడి నుంచి కొనసాగుతాయి అన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ కొండేటి మాట్లాడుతూ… బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌కు క్రిటిక్స్ సంస్థకు ఉన్న అనుబంధం తల్లీ బిడ్డల బంధం. అది ఎప్పటికీ కొనసాగాలనే కోరుకుంటున్నాము. ఇక నుంచి రెగ్యులర్‌గా కార్యక్రమాలు ఇక్కడి నుంచే కొనసాగిస్తాం. మా కార్యాలయాన్ని తిరిగి మాకు అప్పగించాల్సిందిగా టిడబ్ల్యుజె అధ్యక్షుల వారిని కోరుతున్నాం అన్నారు. ఫిలిం క్రిటిక్స్ మాజీ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ… ఫిలిం క్రిటిక్స్ సంస్థ ఎప్పుడో పురుడుపోసుకుంది. సుదీర్ఘకాలంగా ఇదే బిల్డింగ్‌లో కొనసాగుతూ వస్తోంది. ఎప్పుడూ ఎక్కడికీ మారలేదు.. మారబోదు కూడా. ఇక ముందు కూడా టియుడబ్ల్యుజే అనుబంధ సంస్థగానే కొనసాగుతుంది అన్నారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… ఈ ప్రెస్‌క్లబ్ అనేది క్రిటిక్స్‌కు పుట్టిల్లు. దీనితో మా అసోసియేషన్‌కు ఉన్న బంధం పేగుబంధం లాంటిది. ఫిలిం క్రిటిక్స్‌కు కేరాఫ్ ఎప్పటికీ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ మాత్రమే అన్నారు. టియుడబ్ల్యుజే అధ్యక్షులు విరాహత్ ఆలీగారు మాట్లాడుతూ… ఫిలిం క్రిటిక్స్ అనేది ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న సంస్థ. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో అప్పటి నుంచి ఆ సంస్థకు కార్యాలయం ఉంది. అయితే ఇటీవల వారు తమ కార్యాలయాన్ని ఉపయోగించుకోక పోవడంతో మరో సోదర సంస్థ దాన్ని వినియోగించుకుంటోంది. అది ఎప్పటికీ క్రిటిక్స్ కార్యాలయమే. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడ మీ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. ఇంతకు ముందులా రెగ్యులర్‌గా క్రిటిక్స్ ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహించుకుంటే బాగుటుంది అని నా ఫీలింగ్. ఫిలిం క్రిటిక్స్ సంస్థ ఎప్పటికీ మా అనుబంధ సంస్థే. ఇప్పటికీ టియుడబ్ల్యుజే క్యాలెండర్,డైరీలో ఆ విషయాన్ని పేర్కొంటూనే ఉంటాం. క్రిటిక్స్‌కు ఎప్పుడూ అండగానే ఉంటాం అన్నారు. ఈ కార్యక్రమంలో క్రిటిక్స్ ట్రెజరర్ హేమసుందర్, మాజీ సెక్రటరీ జనార్ధన్, సీనియర్ ఫిలిం జర్నలిస్ట్‌లు గిరిధర్, మణిగోపాల్, మురళి, ఆర్.కె. చౌదరి, ‘సింహాసనం’ సురేష్ తదితరులు పాల్గొన్నారు.