చిత్రసీమలో నాకంటూ చిన్న స్థానం ఏర్పరచుకోవాలన్నది నా పెద్ద కోరిక!!
చిత్రసీమలో నాకంటూ చిన్న స్థానం
ఏర్పరచుకోవాలన్నది నా పెద్ద కోరిక!!
“తకిట తదిమి తందాన”తో అరంగేట్రం
చేసిన ఖమ్మం చిన్నది *ప్రియ కొమ్మినేని*
చిన్నప్పటినుంచి సినిమాలంటే చెప్పలేనంత పిచ్చి. స్కూల్, కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని. “తకిట తదిమి తందాన” వంటి మంచి సినిమాతో ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది” అంటోంది అచ్చ తెలుగమ్మాయి ప్రియ కొమ్మినేని. టాప్ హీరోయిన్ అయ్యేందుకు అవసరమైన లక్షణాలన్నీ పుష్కలంగా కలిగిన ఈ “ఖమ్మం బ్యూటీ క్వీన్” ఇంజినీరింగ్ చేసి, కొన్నాళ్ళు ఉద్యోగం చేస్తూనే, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసి, హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది!!
“తకిట తదిమి తందాన” చూసినవాళ్ళంతా… హీరోయిన్ గా ఉజ్వల భవిష్యత్ ఉందని ప్రశంసలు కురిపిస్తుండడంతో… పూర్తి స్థాయిలో కెరీర్ పై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయిపోయింది. “తకిట తదిమి తందాన” నిర్మాత చందన్, దర్శకుడు రాజ్ లోహిత్ లకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్న ప్రియ… ఈ చిత్రానికి లభిస్తున్న స్పందన తనను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని చెబుతోంది!!