*W/O అనిర్వేశ్* ట్రైలర్ లాంచ్ చేసిన *హీరో శివాజీ* రాంప్రసాద్, జెమినీ సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయికిరణ్, నాజియా ఖాన్ నటించిన సినిమా *W/O ఆనిర్వేశ్* గంగా సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో జబర్దస్త్ రాంప్రసాద్ ప్రధాన పాత్రలో నటించగా, గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకం పై వెంకటేశ్వర్లు, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ హీరో *శివాజీ* ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ను బట్టి చూస్తుంటే రాంప్రసాద్ విభిన్నమైనటువంటి పాత్రలో నటించి కామెడీకి భిన్నంగా సస్పెన్స్ థ్రిల్లర్ లో ఈ చిత్రం ఉన్నట్టు ట్రైలర్ ద్వారా అనిపిస్తుందని కచ్చితంగా మంచి హిట్ అవుతుందని దీన్ని జనాలు గుర్తుంచుకుంటారని కొనియాడారు హీరో శివాజీ. నిర్మాత *వెంకటేశ్వర్లు* మాట్లాడుతూ ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది మార్చి ఏడో తారీఖున చిత్రం రిలీజ్ కి సిద్ధమైందని అన్నారు. దర్శకుడు *గంగ సప్తశిఖర* మాట్లాడుతూ జబర్దస్త్ రాంప్రసాద్ వంటి వ్యక్తితో క్రైమ్ థ్రిల్లర్ చేయించడం చాలెంజింగ్ గా అనిపించిందని, ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి గల కారణం కెమెరామెన్ వి ఆర్ కె నాయుడు, మ్యూజిక్ డైరెక్టర్ షణ్ముఖ మరియు మా చిత్రంలో నటించినటువంటి తారాగణం వలన ఈ చిత్రం అద్భుతంగా వచ్చిందని కొనియాడారు. మార్చి ఏడో తారీఖున ఎస్ కే ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం విడుదలవుతుంది.