తెలుగు

సిద్దు రో్లెక్స్ దర్శకత్వంలో షకలక శంకర్ హీరోగా మదర్ ఇండియా

By admin

March 08, 2025

సిద్దు రో్లెక్స్ దర్శకత్వంలో షకలక శంకర్ హీరోగా మదర్ ఇండియా

స్టార్ కమెడియన్ షకలక శంకర్ హీరోగా…దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సిద్దు రో్లెక్స్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… వి.వి.ఆర్ క్రియేషన్స్ పతాకంపై విష్ణువర్ధన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం “మదర్ ఇండియా” త్వరలో సెట్స్ కు వెళ్లనుంది. ఈ చిత్రం పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో జరిగే ఓ కథాంశం. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఈ చిత్ర దర్శకుడు సిద్దు రోలెక్స్.. జిల్లాలో పాల్వాయి అనే తన గ్రామ పరిసర ప్రాంతాలలో ఈ చిత్ర హీరో షకలక శంకర్ తో కలిసి మూవీ చిత్రీకరణ కోసం కావలసిన కొన్ని ప్రదేశాలని సందర్శించారు. అతి త్వరలో ఈ చిత్రాన్ని తెరకేక్కించడంకోసం చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారని చిత్ర నిర్మాత వి.వి.రెడ్డి తెలిపారు!!