పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో “దీక్ష” త్వరలో విడుదల.
*పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో “దీక్ష” త్వరలో విడుదల.*
ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్ లో డా. ప్రతాని రామకృష్ణ గౌడ్, స్వీయ దర్శకత్వంలో కిరణ్, ఆలేఖ్యరెడ్డి హీరో హీరోయిన్స్ గా ఆక్స ఖాన్, తులసి, అనూష,ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం”దీక్ష”. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఒక వ్యక్తి దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనే పాయింట్ ను ఇతివృత్తంగా తీసుకుని లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. చాలా అందమైన లొకేషన్స్ లో, చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పాటలు అద్భుతంగా వచ్చాయి. మా బ్యానర్ కు మంచి పేరు తెచ్చే చిత్రం అవుతుంది. లవ్ యాక్షన్ తో పాటు మైథలాజికల్ ను జోడించి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో కిరణ్ భీముడు పాత్రలో అద్భుతమైన నటన కనపరచాడు. మా చిత్రం ద్వారా హీరో కిరణ్ కి మంచి పేరు, గుర్తింపు వస్తాయి. ఆక్స ఖాన్ స్పెషల్ సాంగ్ లో, తనదైన శైలిలో డాన్స్ ఆదరగొట్టింది. మా చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో దీక్షతో పనిచేసారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అద్భుతమైన 5 పాటలు అందించారు. మధుప్రియ తదితర ముఖ్య గాయనీ గాయకులు తమ స్వరాన్ని అందించారు. ఆర్ ఆర్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. ఈ చిత్రం లో 5ఫైట్స్ ఉన్నాయి. దీక్ష చిత్రం మా బ్యానర్ కు సూపర్ హిట్ అందించే చిత్రం అవుతుంది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.
హీరో కిరణ్ మాట్లాడుతూ.. దీక్ష సినిమా నా కెరీర్ ను మలువు తిప్పే చిత్రం అవుతుంది. అంత బాగా వచ్చింది మూవీ. నా తోటి నటీనటులందరూ బాగా నటించారు. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ లో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
నటి తులసి మాట్లాడుతూ దీక్ష సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. అవకాశం ఇచ్చిన దర్శకులు ఆర్కే గౌడ్ గారికి కృతజ్ఞతలు అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు ప్రతాని రామకృష్ణ గౌడ్, పి. అశోక్ కుమార్, దర్శకత్వం: ఆర్ కె గౌడ్.